తామరాకు మీద నీటిబొట్టు నిలువదు ఎందుకు?
, సోమవారం, 24 ఫిబ్రవరి 2014 (13:45 IST)
ఏదీ పట్టించుకోకుండా ఇతరులతో అంటీ ముట్టనట్లు ఉండేవారి ప్రవర్తనను తామరాకు మీద నీటిబొట్టుతో పోలుస్తుంటారు. ఇప్పుడా విషయం ఎందుకంటే... తామరాకు మీద పడిన నీటిబొట్టు నిలువకుండా జారిపోతుంది. ఎందుకో తెలుసా పిల్లలూ...?ఇతర చెట్ల ఆకుల మీద నీరు పడినప్పుడు ఆకు తడిసిపోతుంది. తామరాకుమీద పడిన నీటిబొట్టు ధగధగమని తెల్లటి ముత్యంలా మెరిసి, జారిపోతుంది. మామూలు ఆకులలో దిగువ భాగంలో సన్నటి రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా వేర్ల నుంచి సేకరించిన నీరు కొంత ఆవిరి అవుతూ ఉంటుంది.తామర కలువ వంటి ఆకులు నీటి మీద తెలియాడటం వల్ల వాటి రంధ్రాలు దిగువ భాగంలో గాక ఆకుపై భాగంలో ఉంటాయి. వాటిపై పలుచని చమురు లాంటి పూతతో కప్పబడి ఉంటాయి. అందువల్ల ఆకుమీద నీరు పడినప్పుడు ఆకు కుళ్లిపోకుండా ఉండేందుకు ఆ నీరప కిందకి జారిపోయేలా చేస్తుంది. వృక్షాలు. జంతువులు ఆత్మ రక్షణ కోసం ప్రసాదించిన ఇలాంటి అద్భుతాలు ఎన్నో వున్నాయి.