పిల్లలూ...! ముళ్లపందుల గురించి మీకు తెలిసే ఉంటుంది. జెవలీనా కూడా అలాంటి ముళ్లపందుల జాతుల్లో ఒకరకం పంది. దీన్ని కొంతమంది ప్రేమగా "పెక్కరి" అని పిలుస్తారట..!
మెక్సికో అడవుల్లో ఎక్కువగా నివసించే ఈ జెవలీనాలను సింహాలు, తోడేళ్ళు, హైనాలు, కొండచిలువలు లాంటి జీవులు ఆహారంగా తీసుకుంటాయి. కళ్ళున్నప్పటికీ శత్రువుని చూసినా వెంటనే గుర్తించే బుర్రలేని జెవలీనాలు ఒట్టి వెర్రిమాలోకాలంటే ఆశ్చర్యపడాల్సి లేదు.
జెవలీనాలు కేవలం వాసనతో శత్రువుల అలికిడిని గుర్తుపట్టి జాగ్రత్త వహిస్తాయి. ఇవి తెల్లవారుజామున, మిట్ట మధ్యాహ్నం మాత్రమే ఆహారం కోసం బొరియల్లోంచి బయటకు వస్తాయి. ఆ సమయాలే వీటికి ప్రధాన శత్రువుల విరామ సమయాలని కూడా చెప్పవచ్చు. ఇలాంటి సమయాల్లోనే మనుషులు కూడా వీటిని వేటాడతారు. పాపం జెవలీనాలు కదూ...!!