Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జంతువులు ఎంతసేపు నిద్రపోతాయో తెలుసా..?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ పిల్లలు రోజు గంట నిద్ర జంతువు సమయం కుక్క పిల్లి మొసలి జిరాఫీ గబ్బిలం గుర్రం ఆవు ఏనుగు
హాయ్ పిల్లలూ...! మనం రోజులో దాదాపు ఎనిమిది గంటలపాటు నిద్రపోతాం కదా. అయితే జంతువులు ఎంత సమయం నిద్రపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* కుక్కలు, పిల్లులు రోజులో 13 నుంచి 16 గంటలసేపు నిద్రపోతూనే ఉంటాయి. అయితే అవి మనలాగా ఏకబిగిన కాకుండా, విడతలు విడతలుగా నిద్రపోతాయి.

* మొసలికయితే 18 గంటల నిద్ర ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఇక జిరాఫీలయితే కేవలం ఆరు గంటలసేపే నిద్రపోతుంటాయి.

* గబ్బిలానికి 19 గంటల నిద్ర ఉండాల్సిందే. అది తలక్రిందులుగా వ్రేలాడుతూ కూడా నిద్రపోగలదు.

* గుర్రానికి చాలా తక్కువ గంటలు.. అంటే 3 గంటల నిద్రయితే సరిపోతుంది. గుర్రం నిల్చుని కూడా నిద్రపోతుంటుంది.

* ఆవుకు మనుషుల్లాగే ఎనిమిది గంటల నిద్ర సరిపోతుంది. ఏనుగుకయితే 4 లేదా 5 గంటలు నిద్రపోతాయి. అది కూడా విడతలు విడతలుగా నిద్రిస్తాయి.

* ఇక చివరగా... జంతువుల రారాజు సింహం అయితే ఆహారం లభించే తీరును బట్టి నిద్రకు సమయం కేటాయిస్తుంటుంది. ఆహారం దొరికే ప్రకారంగా తీసుకుంటే... రోజుకు 8 నుంచి 14 గంటల సేపు దీనికి నిద్ర అవసరం అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu