Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేపలు కూడా మాట్లాడుతాయి....!!

Advertiesment
చేపలు
నీళ్లలో గుంపులుగా కదిలే చేపలను చూస్తుంటే అవి ఏదో పెద్ద మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుంది కదూ..! నిజానికి కొన్ని చేపలు వాటిలో అవి మాట్లాడుకుంటాయి. చిన్న చిన్న శబ్దాలు, మూలుగులు, కిచకిచల ద్వారా తమ పక్క చేపలకు సందేశాలు అందజేస్తాయి.

మనం అనుకున్నట్లుగా సముద్ర అంతర్భాగం అంత ప్రశాంతంగా ఉండదని న్యూజిల్యాండ్‌కు చెందిన ఓ పరిశోధకుడు అంటున్నారు. చేపలు కొన్ని వింత శబ్దాల ద్వారా మిగతా చేపలకు సందేశాలు అందజేస్తాయి. అయితే ఇందులో అన్ని చేపలు మాట్లాడలేవు, కానీ.. వినగలవు. మరికొన్ని చేపలు తమను తాము రక్షించుకోవడానికి విచిత్రమైన శబ్దాలు చేస్తుంటాయని ఆక్లాండ్ కళాశాలకు చెందిన మెరైన్ శాస్త్రవేత్త షాహ్రిమాన్ ఘజాలీ తెలిపారు.

ఇతర చేపలను ఆకర్షించడానికి, శత్రువులను భయపెట్టడానికి, తమను తాము అవగతం చేసుకవటానికి ఇలా పలు కారణాల దృష్ట్యా చేపలు వింత శబ్దాలు చేస్తాయి. గుర్నార్డ్ జాతి చేపలు చాలా పెద్ద స్వరాన్ని, పక్షుల్లాగా రెక్కలను కలిగి ఉండి ఎల్లపుడూ కిలా కిలా అరుస్తూనే ఉంటాయని వివిధ జాతుల చేపల్ని పరిశీలించిన ఘజాలీ అన్నారు.

సాధారణంగా గుడ్లు పెట్టేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో కాడ్ జాతి చేపలు నిశ్శబ్దంగా ఉంటాయి. డామ్‌సెల్ అనే చేప భయపెట్టడానికి, తనని తాను కాపాడుకోవడానికి అరుస్తుంది. ఇది డైవర్లని కూడా తన అరుపులతో భయపెడుతుంది. మీరెవరైనా మీ ఆక్వేరియంలోని గోల్డ్‌ఫిష్‌ని గమనించారా.. దీనికి అద్భుతమైన వినికిడి శక్తి ఉంటుంది. అయితే వినికిడి శక్తి ఉన్నంత మాత్రాన అవి మాట్లాడతాయని కాదు. ఏది ఏమైనప్పటికీ ఇవి శబ్దం చేయలేవు.

Share this Story:

Follow Webdunia telugu