చీమలు... వాటి శరీరంతో పోల్చితే, అవి చాలా అధిక బరువును మోసుకెళుతూ ఉంటాయి. అదేవిధంగా మనుషులు మోసే బరువును పరిశీలిస్తే... అది స్వల్పంగా ఉండి, చీమలతో పోల్చినప్పుడు మన బలప్రదర్శన చాలా పేలవంగా ఉంటుంది.
శరీరంలో బరువును మోసేందుకు ఉపయోగపడేవి కండరాలు. బరువులను పైకి లేపేందుకు, నెత్తిన పెట్టుకునేందుకు అవసరమైన శక్తి మడచిన కండరాల వల్ల లభిస్తుంది. ఒక అవయవం మోయగల బరువు ఆ అవయవంలోని అన్ని కండరాల కండర తంతువుల సంఖ్య, మందం తదితర విషయాలను బట్టి ఉంటుంది.
మానవుల కండరాల మందం మిగతా శరీరంతో పోలిస్తే చాలా స్వల్పంగా ఉంటుంది. అదే చీమల శరీరంలో అయితే... వాటి కండరాలు చాలా లావుగా, బలంగా ఉంటాయి. కాబట్టి, మనిషి తనకంటే ఎక్కువ బరువులు మోయాలంటే.. కండరాలను బాగా బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ చీమలు మాత్రం, తమ ఒంట్లో సహజంగా ఉన్న బలమైన కండరాలతోటే అధిక బరువులను సునాయాసంగా మోసుకుపోతుంటాయి.