Article General Knowledge %e0%b0%97%e0%b1%81%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a1%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%af%e0%b0%b2 %e0%b0%a6%e0%b1%8a%e0%b0%82%e0%b0%97 108093000049_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుమ్మడికాయల దొంగ..!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ గుమ్మడికాయ దొంగ భుజం సామెత రోజు తప్పు కథ బూడిద చెట్టు భార్య యజమాని సూరయ్య
FileFILE
పిల్లలూ...! "గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకోవడం" అనే సామెత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం..! ఎవరైనా చేసిన తప్పును తనకు తానుగానే తెలియజేసేలా ప్రవర్తించినప్పుడు ఈ సామెతను వాడుతుంటారు. ఈ సామెత వెనుక ఓ చిన్నపాటి కథ కూడా ఉంది.. అదేంటో చూద్దామా..!

ఒక ఊర్లో ఓ బూడిద గుమ్మడి చెట్టు ఉండేదట. దానికి కాసిన కాయలను కోసుకుందామని ఆ చెట్టు యజమాని వెళ్లేసరికి అవి కనిపించవు. మన చెట్లో ఉండే గుమ్మడికాయలను ఎవరో దొంగిలించుకెళ్లారని భార్యతో చెబుతుంటాడు అతను. ఇంతలో పక్కింట్లో కిటికీ పక్కగా నిల్చుని వింటోన్న సూరయ్య వెంటనే తన భుజాలను తడుముకున్నాడట. దాంతో ఆ కాయలను అతడే దొంగిలించాడేమోనన్న ఇంటివాళ్లకు అనుమానం వస్తుంది.

దొంగతనంగా గుమ్మడికాయలను తీసుకెళ్తున్నప్పుడు వాటికున్న బూడిద తన భుజాలకు అంటిందేమోనని, ఆ బూడిదను ఇంటివాళ్లు చూసి అలా మాట్లాడుకుంటున్నారేమోనని సూరయ్య వెంటనే భుజాలను తడుముకున్నాడు. అప్పటిదాకా అనుమానం రాని వాళ్లకు కూడా అతను భుజాలు తడుముకోవడం చూసి అతడే దొంగిలించి ఉంటాడని అందరూ నిర్ధారణకు వచ్చేశారట..!

Share this Story:

Follow Webdunia telugu