Article General Knowledge %e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%82%e0%b0%a8%e0%b1%8d %e0%b0%b2%e0%b0%82%e0%b0%9f%e0%b1%87 108081900023_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"కార్టూన్"లంటే...?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ పిల్లలు న్యూస్ పేపర్లు టీవీ ఛానల్స్ కార్టూన్లు చిత్రాలు వ్యంగ్య చిత్రాలు
, మంగళవారం, 19 ఆగస్టు 2008 (14:11 IST)
FileFILE
పిల్లలూ...! ప్రస్తుతం అన్నిరకాల న్యూస్ పేపర్లలోనూ, టీవీ ఛానల్స్‌లోనూ కార్టూన్‌ (వ్యంగ్య చిత్రాలు)లను మీరు చూస్తూనే ఉంటారు. అసలు ఈ కార్టూన్ చిత్రాలు గీయటం ఎప్పటినుంచి ప్రారంభించారు. మన దేశంలో మొదటి కార్టూనిస్ట్ ఎవరు అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం...!
బొమ్మలు గీయడం వస్తే...!
  బొమ్మలు గీయడం వస్తే కార్టూన్లు వేయడం చాలా సులువు తెలుసా..?! అయితే బొమ్మలు గీయడానికి కొంచెం శ్రద్ధ, మరికొంచెం నిశిత పరిశీలన కావాలి. అలాంటప్పుడే మీరు గీసిన కార్టూన్ అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది...      


రకరకాల రంగులతో కుంచెలను తీసుకుని కాన్వాస్‌లపై రోజుల తరబడీ వేసిన పెద్ద పెద్ద పెయింటింగ్‌ల కంటే.. ఇండియన్ ఇంక్‌తో పేపర్‌పై నాలుగు గీతల్లో వేసే కార్టూన్లకే ప్రజలు ఎక్కువగా స్పందిస్తున్నారు. కనుకనే, ప్రపంచ దేశాలన్నీ వీటిని ఆదరిస్తున్నాయి. ప్రపంచంలో మొట్టమొదటగా రాజకీయ నాయకులపై వ్యంగ్య చిత్రాలను గీసే సంప్రదాయాన్ని బ్రిటీష్ కార్టూనిస్ట్ 'డేవిడ్‌లో' మొదలు పెట్టాడు.

భారతదేశంలో కేరళకు చెందిన శంకర్ పిళ్ళై కార్టూన్‌లను చిత్రీకరించటం మొదలుపెట్టాడు. ఇతను శంకర్స్ వీక్లీ అనే కార్టూన్ పత్రికను చాలాకాలం పాటు నిర్వహించాడు. అంతేగాకుండా... చిన్నారుల కోసం ఢిల్లీలో ఓ కార్టూన్ గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. శంకర్ తరువాత చాలామంది కార్టూనిస్టులు వెలుగులోకి వచ్చారు.

రెండవ ప్రపంచ యుద్దం జరుగుతున్నప్పుడు హిట్లర్ మీద కార్టూన్ వేసిన డేవిడ్‌లో తన ప్రాణం మీదికి తెచ్చుకున్నాడట. పాపం ప్రాణాలు కాపాడుకునేందుకు ఈయన జర్మనీ నుంచి రష్యా పారిపోయి బతకాల్సి వచ్చిందట. అలాగే... కొన్నేళ్ళ క్రితం యూరప్‌లో ఓ మత సంప్రదాయం మీద కార్టున్ వేసినందుకు కూడా ఆయనను జైల్లో పెట్టారు. ఎమర్జెన్సీ సమయంలో మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆర్కేలక్ష్మణ్ కార్టూన్లను కూడా సెన్సార్ చేశారు.

యూరప్ వారి నుంచి సంక్రమించిన ఈ కార్టూనిస్ట్ కళ మన దేశానిది కాకపోవడం వల్లనే... మన లలిత కళల్లో ఇది చోటు సంపాదించుకోలేక పోయింది. అయితే మిగిలిన కళలన్నింటికంటే భిన్నమైంది కనుకనే... అందరినీ రంజింపజేసే కళగా ఈ ప్రక్రియ ఎదిగింది.

పిల్లలూ...! కాస్తంత బొమ్మలు గీయడం వస్తే కార్టూన్లు వేయడం చాలా సులువు తెలుసా..?! అయితే బొమ్మలు గీయడానికి కొంచెం శ్రద్ధ, మరికొంచెం నిశిత పరిశీలన కావాలి. అలాంటప్పుడే మీరు గీసిన కార్టూన్ అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది. ఇంకేముందీ... కార్టూన్లు గీసేందుకు ప్రయత్నిస్తారు కదూ...!

Share this Story:

Follow Webdunia telugu