Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓజోన్‌కు కాపాడుకుందాం... భూమాతకు చేయూతనిద్దాం...!!

Advertiesment
బాలప్రపంచం
FILE
భావితరాలకు సంపదను సృష్టించేందుకు క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్న మానవుడు.. ఆరోగ్యకరమైన ప్రకృతిని మాత్రం మర్చిపోతున్నాడు. సాంకేతికత ముసగులో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు. సమస్త మానవాళిని ప్రమాదకరమైన సూర్య కిరణాల నుంచి కంటికి రెప్పలా కాపలా కాస్తున్న ఓజోన్ పొరను నిర్లక్ష్యం చేస్తున్నాడు. దానికి ఫలితంగా మానవాళితోపాటు జీవజాలం, ప్రకృతి సంపద అంతా కాలగర్భంలో కలిసిపోతోంది.

ఇంతటి పెను నష్టాన్ని నివారించేందుకు ఇప్పటికైనా ఓజోన్ పొర పరిరక్షణకు చర్యలు ప్రారంభించకపోతే భవిష్యత్తులో భూమిపై మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఈ ఓజోన్ పొర ప్రాధాన్యాన్ని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని, మన కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన "అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం"ను జరుపుతున్నారు.

ఓజోన్ పొరకు ఏర్పడిన చిల్లులను, అవి మానవాళికి తెచ్చే పెను ప్రమాదాలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి 1987, సెప్టెంబర్ 16వ తేదీన కెనడాలోని మౌంటేరియా సిటీలో ప్రపంచస్థాయి సదస్సునొక దానిని నిర్వహించింది. ఈ సందర్భంగా ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్న పదార్ధాల నియంత్రణకుగాను రూపొందించిన మాంట్రియల్ ప్రొటోకాల్‌పై ప్రపంచ దేశాలు సంతకాలు చేశాయి. ఇక అప్పటినుంచి ప్రతి యేడాది సెప్టెంబర్ 16ను అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణా దినంగా పరిగణిస్తున్నారు. భూమ్మీద కాలుష్యం కారణంగా దెబ్బతింటున్న ఓజోన్ పొరను పరిరక్షించటమే ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
గ్లోబల్ వార్మింగ్‌తో నష్టం
ఈ గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల హిమాలయాల్లో ఉన్న హిమాని నదులు కరిగిపోతాయట. 2035నాటికి తూర్పు మధ్య ప్రాంతాల్లో నదులు కనిపించకుండాపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఆహార, నీటి సంక్షోభంతోపాటు, వడగాలుల కారణంగా భారీగా ప్రాణాలు...
webdunia


ఇంతకీ ఈ ఓజోన్ పొర ఏం చేస్తుందంటే.. భూమి పైభాగంలో స్ట్రాటోస్పియర్‌ ఆవరణలో ఉన్న ఈ పొర భూమ్మీదికి వచ్చే అన్ని అల్ట్రావయోలెట్‌(యువి) కిరణాలను అడ్డుకుని భూమిని పరిరక్షిస్తుంది. దీని ఉనికిని 1840లో గుర్తించారు. 112డిగ్రీల వద్ద ద్రవరూపంలోకి మారి ముదురు నీలివర్ణంలో ఉంటే, 193డిగ్రీల వద్ద ముదురు వయోలెట్‌రంగును పోలి ఘనరూపంలో ఉంటుంది.

సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాలు 270 నుంచి 400మీటర్ల కొలతతో ఉంటాయి. అల్ట్రావయోలెట్‌(యువి) కిరణాలు యువిఎ, యువిబి, యువిసి అనే మూడు రకాలుగా ఉంటాయి. యువిఎ అంత ప్రమాదకరం కాదుగానీ.. దీనిని సోరియాసిస్‌ వంటి వ్యాధులు చికిత్సల్లో కూడా వాడతారు. అయితే యువిబి ఫలితంగా చర్మంపై ఎర్రటి మచ్చలూ, తీవ్రమైన పొక్కులు వస్తాయి. ఇక చివరిదైన యువిసి మాత్రం చాలా ప్రమాదకరమైంది. ఈ మూడు ప్రమాదకరమైన కిరణాలను హరించి వేసే శక్తి కలిగినదే ఓజోన్‌పొర.

భూమి చుట్టూ అతినీల లోహిత కిరణాల నుండి రక్షణ కవచంగా పనిచేస్తోన్న ఈ ఓజోన్‌పొర, గ్రీన్‌ హౌస్‌ వాయువుల వల్ల తరిగిపోవడాన్నే గ్లోబల్‌ వార్మింగ్‌, భూమివేడెక్కడం అని అంటున్నారు. దీనికి ముఖ్యకారణం గ్రీన్‌ హౌస్‌ వాయువులు. పెట్రో ఉత్పత్తుల వినియోగం ద్వారా అవసరాన్ని మించి అధిక మొత్తంలో వాడకం ద్వారా పెనుముప్పు పొంచి ఉందని నిపుణులు అంటున్నారు.

అంతేకాకుండా ఈ గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల హిమాలయాల్లో ఉన్న హిమాని నదులు కరిగిపోతాయట. 2035నాటికి తూర్పు మధ్య ప్రాంతాల్లో నదులు కనిపించకుండాపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఆహార, నీటి సంక్షోభంతోపాటు, వడగాలుల కారణంగా భారీగా ప్రాణాలు కోల్పొవచ్చు. కరువు పరిస్థితులాంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది.

అలాగే మానవుల్లో చర్మ క్యాన్సర్, వ్యాధి నిరోధక శక్తి క్షీణించటం, కంటి శుక్లాలు భయంకరమైన సమస్యలను ఓజోన్ క్షీణతవల్ల ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా భూమి వేడెక్కడంతోపాటు రుతుపవనాలు గతి తప్పడం, వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుని పంట దిగుబడులు తగ్గిపోవటం తదితర సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది.

ఏది ఏమైనప్పటికీ భూమి క్రమంగా వేడెక్కు తోందనేది కఠోర సత్యం. మనల్ని మనం ఎలా కాపాడుకోడానికి ప్రయత్నం చేస్తున్నామో పర్యవరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పర్యావరణాన్ని నిరక్ష్యం చేస్తే భావితరాల వారి భవిత ప్రశ్నార్థకంగా మారకతప్పదు. ప్రతి ఏడాది ఓజోన్ పరిరక్షణా దినాన్ని జరుపుకుంటున్నామేగానీ, కానీ అది ఆచరణలో మాత్రం కనిపించటంలేదు.

కాబట్టి ఇకనైనా... పర్యావరణం, ఓజోన్‌ పొర రక్షణకు సంబంధించి ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. ఈ అంశంపై స్థానికంగా సదస్సులను నిర్వహించాలి. ప్రియాన్ సీఎఫ్‌సీల వాడకాన్ని అరికట్టాలి. ప్రత్యామ్నాయంగా వచ్చిన వస్తువులను ఉపయోగించాలి. ఓజోన్‌కు నష్టం కలిగించే పరిశ్రమలను క్రమంగా నిషేధించాలి. పచ్చదనాన్ని పెంపొందించాలి.

ఈ విధంగా.. ఓజోన్ పొరకు పడ్డ చిల్లును పూడ్చడం ద్వారా ప్రతిదేశం, ఓజోన్ పరిరక్షణకు, భూమాత పరిరక్షణకు తన వంతు ప్రయత్నాలను చిత్తశుద్ధితో పూర్తి చేయాలి. ఇదే ఓజోన్ పరిరక్షణా దినం.. అంతర్జాతీయ మానవాళికి ఇస్తున్న సందేశం. ఈ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆశిస్తూ...!!

Share this Story:

Follow Webdunia telugu