Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎడారుల్లో నదులూ, సరస్సులుంటాయా...?!

Advertiesment
బాలప్రపంచం
పిల్లలూ... ఎడారి ప్రాంతాలలో అక్కడక్కడా కొద్ది కొద్దిగా నీరుండే ప్రాంతాలు ఉంటాయని, వాటిని ఒయాసిస్సులు అని అంటారని మీకు తెలుసు కదూ...! అయితే ఈ ఏడారుల్లో నదులూ, సరస్సులు వంటివి కూడా ఉంటాయి. ఆఫ్రికాలో ప్రవహించే నైలునది, అంటార్కిటికాలో ఉండే "విడా" అనే సరస్సులు ఈ కోవకిందకే వస్తాయి.

ఎడారుల్లో ప్రవహించే నదులు ప్రధానంగా రెండు రకాలు కాగా... వీటిలో మొదటి రకం నదులు ఎడారుల్లో పుట్టి, ఎడారుల్లోనే అంతరించిపోతాయి. ఇలాంటి నదులు సాధారణంగా ఒక నిర్దిష్ట రుతువులో మాత్రమే కనిపిస్తుంటాయి. ఇక రెండో రకం నదులు ఎడారుల్లోనే కాక, ఎడారులకు వెలుపల ఇంకెక్కడనో పుట్టి, ఎడారుల గుండా ప్రవహించి, సముద్రంలో కలసిపోతుంటాయి. ఆఫ్రికాలోని నైలునది, ఆసియాలోని సింధునది ఇలాంటి నదులకు ఉదాహరణగా చెప్పవచ్చు.

కొన్ని రకాల ఎడారులలో సరస్సులు ఉన్నప్పటికీ వాటిలోని నీరు చాలా ఉప్పగా ఉంటుంది. అప్పుడప్పుడూ కురిసే వానలకి ఈ సరస్సుల్లోకి కొత్తనీరు చేరినా, ఆ నీరు అక్కడి వాతావరణానికి త్వరగా ఇగిరిపోవడం వల్ల... నీరు ఎల్లప్పుడూ లవణాలతో చిక్కగా భరించలేనంత ఉప్పగా ఉంటుంది.

ఇదిలా ఉంటే... అంటార్కిటికాలో ఉండే "విడా" సరస్సుకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే... సరస్సు చుట్టూ మైళ్లకొద్దీ విస్తీర్ణంలో ఏడాది పొడవునా మంచే ఉంటున్నా, ఈ సరస్సులోని నీరు మాత్రం ఎప్పుడూ గడ్డ కట్టదు. ఎందుకంటే.. ఇందులోని నీరు సముద్రం నీటికంటే, ఏడురెట్లు అధికంగా సాంద్రత కలిగి ఉండటమే. దీనివల్లనే కనిపించే ప్రాంతమంతా మంచుతో గడ్డ కట్టుకుపోయినా, ఈ సరస్సులోని నీరు మాత్రం ప్రవహిస్తూనే ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu