పిల్లలూ... ఎడారుల్లో, సముద్రంలో, నదుల్లో, వాగులు వంకలు... ఇలా భూమిమీద ఎక్కడబడితే అక్కడ ఇసుక కనిపిస్తుంటుంది కదా..! మరి ఈ ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? అన్న ఆలోచన మీకు ఎప్పుడయినా కలిగిందా..?
రకరకాలైన, రంగురంగుల ఇసుక... ఆకాశం నుంచి వస్తుందా, సముద్రంలోంచి వస్తుందా... అసలు ఎలా వస్తుంది? మరేం లేదు పిల్లలూ... ఇసుక ఎప్పుడు కూడా ఏ ఆకాశం నుంచో, సముద్రం నుంచో, భూమిలోనుంచో ఊడిపడదు.
అనేక మిలియన్ మిలియన్ సంవత్సరాలుగా గాలి, వాన, మంచు, నీరు కారణంగా రాళ్లు, బండలు పగిలిపోయి.. అతి సన్నటి రేణువులుగా తయారవుతున్నాయి. అలా తయారయిన రేణువులే ఇసుకగా మారుతాయి. ఇసుకలో ఎక్కువగా ఉండే ఖనిజ లవణాల శాతాన్ని బట్టి.. అది రంగు రంగులుగా మారుతుంటుంది అంతే...!