* మాటలు, నవ్వు, ఏడుపు.. ఇలా కారణం ఏదైనప్పటికీ మన పెదవులు సగటున రోజుకు పదిహేను వందలసార్లు కదులుతాయట.
* కొన్ని రకాల చేపలు నేలపైన కూడా నడవగలవు.
* క్రీ.శ. 1715 ముందు వరకు కూడా కాఫీలో పంచదార కలిపే అలవాటు లేదట. ఫ్రాన్స్ చక్రవర్తి పద్నాలుగో లూయీ ఆస్థానంలో తొలిసారిగా ఈ అలవాటు మొదలైందట. ఆ తరువాత అది ప్రపంచంమంతటికీ విస్తరించింది.
* యూకేలోని బర్మింగ్‌హామ్ ఎమ్6 రోడ్డు నిర్మాణంలో 25 లక్షల పుస్తకాల తాలూకూ గుజ్జును వాడారట. అవన్నీ మిల్స్ అండ్ బూన్ నవలలే కావడం ఇంకో విశేషం. పుస్తకాల గుజ్జు ఉపయోగించి చేసే నిర్మాణాలకు శబ్దాన్ని బాగా నిక్షిప్తం చేసుకోగలిగే శక్తి (సౌండ్ అబ్జార్బర్స్) ఉండటమే ఇందుకు కారణమట.
* మానవుడు నిర్మించిన కృత్రిమ ఉపగ్రహాల్లో ఖగోళ పదార్థాల తాకిడికి గురై ధ్వంసమైన ఏకైక శాటిలైట్ ఏదంటే... "ఒలింపస్ (1993)".
* మిల్లీపీడ్స్ రకం కీటకాల శరీరంలో ప్రతి భాగం మీదా నాలుగు కాళ్లుంటాయట.