టైపింగ్ మెషీన్‌లో పై వరుసలో "క్యుడబ్ల్యుఇఆర్‌టి వైయుఐఒపి" అనే అక్షరాలు ఎందుకుంటాయో తెలుసా..? అవి టైపింగ్ మెషీన్‌ను కనిపెట్టిన హంగరీ దేశస్తుని పేరులోని అక్షరాలు.
స్త్రీలకు మొట్టమొదట పౌర హక్కులు కల్పించిన దేశం న్యూజిలాండ్. ఇక్కడం 1895లో స్త్రీలకు ఓటుహక్కు లభించింది.
1173లో పునాది వేసింది మొదలు పీసా టవర్ కుంగిపోవటం ప్రారంభించింది. దీంతో దాని నిర్మాణాన్ని ఆపేశారు. తిరిగీ వంద సంవత్సరాల తరువాత అదే పునాదిపై మళ్ళీ నిర్మాణం ప్రారంభించారు. అప్పటినుంచి ఆ భవనం ఓ పక్కకి ఒరిగిపోయే ఉంటుంది.
భార రహిత స్థితిలో పెప్సీలో ఒక చిక్కుడు గింజను వేస్తే... అది పెద్ద శబ్దంతో పేలిపోతుంది.
మాంటీస్ అనే క్షీరదాల వర్గానికి చెందిన సముద్ర జీవికి అచ్చంగా మనిషిని పోలిన స్వర తంత్రులే ఉన్నాయి. కాబట్టి అవి మాట్లాడగలవు. కానీ ఎందుకు మాట్లాడవంటే... వాటికి శబ్దాలను వినేందుకు చెవులుండవు.