* బనానా అనే పదం అరబిక్ పదమైన బనాన్ నుండి పుట్టింది. బనాన్ అంటే ఆ భాషలో వేలు అని అర్థం
* ఇప్పటిదాకా అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో 26 మంది న్యాయవాదులున్నారు.
* ప్రపంచవ్యాప్తంగా రోజుకు 200 బ్యాంకులు దోపిడీకి గురవుతున్నాయి.
* తాజ్‌మహల్ నిర్మించే సమయంలో వివిధ పనుల కోసం పదివేల ఏనుగులను ఉపయోగించారట.
* భారతదేశంలో సెల్‌ఫోన్ వాడుతున్న వారి సంఖ్య నెలకు 25 లక్షల చొప్పున పెరుగుతోంది.
* బర్మాలో వాహనాలను రోడ్డుకు కుడివైపున నడుపుతారు. మనదేశంలో ఎడమవైపు నడుపుతారన్న విషయం మీకు తెలుసు కదూ..!
* ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం హిమాచల్‌ప్రదేశ్‌లోని చెయిల్ అనే ప్రాంతంలో ఉంది.