విమానం గాలిలో ఆగుతుందా... అవునా..! నిజమా... అనే వారి సంఖ్యే అధికంగా ఉంటుంది. అందులోనూ చిన్నపిల్లల్లో మరీ ఆసక్తి ఎక్కువ. ఆగితే పడిపోదా? ఆగితే ఎలా ఆగుతుంది? ఇలా పలు సందేహాలు వారి మస్తిష్కాలను తొలిచేస్తుంటాయి. వారికోసమే ఈ సమాచారం.
అవును..! విమానం గాలిలో ఆగుతుంది. మళ్ళీ అనుమానం.... ఎందుకు ఆగుతుంది?
రోడ్డుపై వాహనాలకు ఉన్నట్లే విమానాలకు కూడా గాలిలో ఎన్నో అవాంతరాలుంటాయి. మేఘాలు,పొగమంచు, ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ సమస్య... ఇలా అడ్డంకులుంటాయి. రోడ్డుపై వెళ్లే వాహనాల్లాగే ఇంజన్ వేడెక్కుతుంది. అలాంటప్పుడు కూడా విమానాన్ని గాలిలో నిలుపుతారు.
దట్టమైన మంచు పొగలు కమ్ముకున్నప్పుడు లేదా మేఘాలు ఆవరించినప్పుడు సిగ్నల్స్ సన్నగిల్లుతాయి. అలాంటప్పుడు విమానం ముందుకు వెళ్ళితే దారి తప్పే ప్రమాదం ఉంటుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటప్పుడు విమానాన్ని గాలిలోనే నిలిపేస్తారు.
ఎంతసేపు నిలిపివేయవచ్చంటే.. అరగంట పాటు సాధ్యమవుతుంది. అవాంతరాలను అధిగమించిన మీదట ముందుకు సాగుతారు.కొన్ని విమానాలు పొగమంచు, మేఘాల్లో కూడా దూసుకు పోగలవు.