భూమి ఎప్పుడు ఏర్పడిందన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ సుమారు 6,000 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. భూమి ఏర్పడిన సుమారు 3,000 మిలియన్ల సంవత్సరాల తర్వాత భూమి మీద జీవరాశులు పుట్టిందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అధిక వేడి వాయువులతో కూడిన ఒక పెద్ద గోళం వాతావరణంలోని మార్పులకు విస్ఫోటనం చెంది చల్లబడి, ఘనీభవించి భూగోళంగా ఉద్భవించింది. సముద్రంలోని అట్టడుగున ఉన్న రసాయనాలను బట్టి మొదట్లో గాలిలో రకరకాల విషపూరిత వాయువులు ఉన్నాయని ఆ వాయువులన్నీ పరస్పర చర్య జరపటం వల్ల ఆక్సిజన్ వాయువు పుట్టిందని తెలుస్తోంది.