Article General Knowledge %e0%b0%85%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%80 %e0%b0%89%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8 %e0%b0%86%e0%b0%95%e0%b1%81 108092900024_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నీ ఉన్న ఆకు...!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ ఆకు ఎగిరెగిరి సామెత ఈరోజు పంచభక్ష్య పరమాన్నం నిశ్చలం వంటకం జ్ఞానం మృదువు జాగ్రత్త
, సోమవారం, 29 సెప్టెంబరు 2008 (14:06 IST)
WD
పిల్లలూ...! "అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీలేని ఆకు ఎగిరెగిరి పడుతుంది" అనే సామెత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.

పంచభక్ష్య పరమాన్నాలతో నిండుగా ఉన్న ఆకు ఎగిరెగిరి పడకుండా, నిశ్చలంగా ఉంటుంది. అదే వంటకాలేవీ వడ్డించని ఆకు ఎగెరెగిరి పడుతుంటుందని ఈ సామెత యొక్క భావం.

అంటే... బాగా చదువుకుని జ్ఞానాన్ని సంపాదించిన వారికి, తమకి ఏది తెలియదో బాగా తెలుసు. అందుకే మీకేమండీ గొప్పవాళ్లు, మీకు తెలియనిదంటూ ఏదీ లేదని అన్నారంటే... వాళ్లు వినయంగా, ఈ ప్రపంచంలో ఏ ఒక్కడూ గొప్పవాడు కాడండి... మనకంటే గొప్పవాళ్లు ఎప్పుడూ ఉంటారని మృదువుగా చెబుతారు. అదే మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లు తమని మించినవాళ్ళు లేరని విర్రవీగుతారు.

జ్ఞానాన్ని పెంచుకోవడంలో ఎదిగేకొద్దీ, ప్రవర్తనలో ఒదిగి ఉంటారని... ఈ సామెతలోని అంతరార్థం. దీని భావాన్ని గ్రహించి మీరు జాగ్రత్తగా మెలగుతారు కదూ.. పిల్లలూ...!

Share this Story:

Follow Webdunia telugu