అతిపెద్ద ముక్కు కలిగిన పక్షి.
, బుధవారం, 23 నవంబరు 2011 (16:29 IST)
సాధారణంగా పక్షులకు చిన్న ముక్కులు ఉండటాన్ని, కొంగలాంటి వాటికి ముక్కులు కాస్త పొడవుగా ఉండటాన్ని తెలుసు. కాని ఈ పక్షికి మాత్రం ముక్కు చాలా పొడవుగా ఉంటుందటా! అది ఏ పక్షో తెలుసా మీకు? ఆస్ట్రేలియన్ పెలికాన్ అనే పక్షి. దీనికి ముక్కు అత్యంత పొడవైనదని భావిస్తున్నారు. ఈ పక్షి ముక్కు పొడవు దాదాపు 47 సెంటీ మీటర్లు ఉంటుంది.అయితే పక్షి శరీరంతో పోల్చి చూస్తే అత్యంత పొడవైన ముక్కు కలిగిన పక్షి స్వోర్డ్ బిల్‌డ్ హమ్మింగ్ బర్డ్ అని అంటున్నారు. కత్తి లాంటి ముక్కు ఉన్న ఈ పక్షి శరీరం పొడవు 13.5 సెంటీ మీటర్లు. మరి దాని ముక్కు పొడవు 10.5 సెంటీ మీటర్లు. అంటే కేవలం ముక్కు పొడవుకి, శరీరం పొడవుకి తేడా 2 సెంటీ మీటర్లే. అందుకే చూడటానికి శరీరం ఎంత పొడవు ఉంటుందో, ముక్కు కూడా అంతే పొడవు ఉన్నట్లుగా కనిపిస్తుంది.