Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్నారులపై సంగీత ప్రభావం!!

చిన్నారులపై సంగీత ప్రభావం!!
, బుధవారం, 6 ఆగస్టు 2014 (13:36 IST)
సంగీతం మంచి ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈ భావన వెనుక శాస్త్రీయ కోణం ఉన్నదా అని ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉంది. అప్పుడు వెంటనే జవాబు చెప్పలేక మనం ఆలోచనలో పడతాం. అయితే మన ఆలోచనలకు ఫుల్‌స్టాప్ తగిన సమాధానం చెప్పేందుకు ఇంటెల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్ సరికొత్త ప్రయోగంతో ముందుకు వచ్చింది.
 
సంగీతం లేదా శాస్త్రీయ సంగీతం తాలూకు ప్రభావానికి శాస్త్రబద్ధత కల్పించింది. ఇందుకుగాను 1500 బాలలపై వివిధ రకాల సంగీతాలకు లోనుచేసింది. శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించిన బాలల్లో తెల్ల రక్త కణాల సంఖ్య గణనీయంగా పెరగడాన్ని అధ్యయనకారులు గమనించారు. అంతేకాక వారిలో ఏకాగ్రత సైతం వృద్ధి చెందింది. 
 
ఇక రాక్ సంగీతాన్ని ఆస్వాదించిన బాలల స్థితి పైన పేర్కొన్న దానికి విరుద్ధంగా ఉంది. అత్యధిక ధ్వని స్థాయితో రాక్ సంగీతాన్ని వినడం కారణంగా వారిలో ఆకలి తగ్గిపోయింది. ఇక యువకులైతే తీవ్రమైన ఉత్తేజానికి గురై వాహనాలను నడిపే సమయంలో ఏకాగ్రతను కోల్పోయి ప్రమాదాలకు లోనయ్యారు. సంగీతం వెనుక మరో కథ కూడా వినవస్తోంది. సంగీతాన్ని వింటూ లెక్కలు చేయడం మొదలుపెడితే, కష్టమైన లెక్కలు కూడా సులువుగా చేసేయొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu