"గేట్ వే ఆఫ్ ఇండియా" ముంబై నగరంలోని అపోలో బందర్ ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉంది. దీని ఎత్తు 85 మీటర్లు. ఇదో స్మారక కట్టడం. సముద్రం ద్వారా వచ్చే అతిథులకు ఇదో స్వాగత ద్వారం. బోట్ల ద్వారా ముంబై వచ్చే సందర్శకులకు ముందుగా కనిపించేది కూడా ఇదే.
భారతీయ, యూరోపియన్ నిర్మాణ శైలిలో గేట్ వే ఆఫ్ ఇండియాను నిర్మించారు. అప్పట్లో దీని నిర్మాణానికి 21 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. 1911వ సంవత్సరం డిసెంబర్‌లో బ్రిటన్ రాజు కింగ్ జార్జ్-5, క్వీన్ మేరీలు భారత పర్యటనకు గుర్తుగా అదే సంవత్సరం మార్చి 31వ తేదీన దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1924 డిసెంబర్‌లో కట్టడాన్ని పూర్తి చేశారు.
బ్రిటీష్ సైన్యం భారత్ నుంచి వెనుదిరిగినప్పుడు అందులోని సోమర్‌సెట్ లైట్ ఇన్‌ఫ్రాంటీ మొదటి దళం గేట్ వే ఆఫ్ ఇండియా నుంచే బయలుదేరి వెళ్లింది. ఇదిలావుంటే.. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచే ముంబైలోకి చొరబడిన ఉగ్రవాదులు గత సంవత్సరం నవంబర్ 26వ తేదీన మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే.