Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"సీసీ టీవీ" అంటే ఏంటి..? అది ఏం చేస్తుంది..?

Advertiesment
జనరల్ నాలెడ్జ్
FILE
సీసీ టీవీ అంటే "క్లోజ్‌డ్ సర్క్యూట్ టెలివిజన్" అన్నదాన్నే క్లుప్తంగా సీసీ టీవీ అని అంటారు. ఒక నిర్దిష్ట ప్రదేశంలో జరిగే విషయాలను లేదా సంఘటనలను స్పష్టంగా తెలుసుకునేందుకు, రికార్డు చేసేందుకు ఉద్దేశించిన కమ్యూనికేషన్ వ్యవస్థల్లో ఇది కూడా ఒకటి.

ఇందులో భాగంగా.. ఏదైనా ఒక ప్రదేశంలో ఏర్పాటు చేసిన కొన్ని వీడియో కెమెరాలు ఆ ప్రదేశానికి సంబంధించిన దృశ్యాలను ఎప్పటికప్పుడు వాటిని నిర్దేశించిన పరికరాలకు లేదా టీవీలకు పంపుతుంటాయి. దాంతో జనం బాగా తిరిగేచోట ఎవరెవరు ఏం చేస్తున్నారనే విషయాలను తెలుసుకునేందుకు ఈ సీసీ టీవీ కెమెరాలు బాగా ఉపయోగపడతాయి.

సాధారణంగా ఈ సీసీ టీవీ కెమెరాలను విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, పెద్ద పెద్ద షాపులు, బ్యాంకులు వంటి వాటిల్లోనూ.. జనం ఎక్కువగా తిరిగే రోడ్లవద్ద ఏర్పాటు చేస్తుంటారు. ఈ కెమెరాలలో కొన్ని నిశ్చలంగా ఉంటూ తమ పరిధిలోకి వచ్చే దృశ్యాలను గమనిస్తుంటే, మరికొన్ని చుట్టూ తిరుగుతూ ఎక్కువ ప్రదేశాన్ని కవర్ చేస్తూ ఉంటాయి.

సీసీ టీవీ కెమెరాలను గోడలకు, పై కప్పులకు, స్తంభాల వంటి నిర్మాణాలకు అమరుస్తుంటారు. వీటి ద్వారా సీసీ టీవీలు అందించే సమాచారం సహాయంతో దొంగతనాలను అరికట్టేందుకు, నేరస్తులను త్వరగా పట్టుకునేందుకు వీలవుతుంది. అలాగే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఏవేని సంస్థలు, కార్యాలయాల్లోకి వచ్చినా సీసీ కెమెరాలు సులభంగా పట్టుకునేస్తాయి. అందుకే ఈ రోజుల్లో అనేక రకాల సంస్థలు వారి కార్యాలయాల్లో ఈ సీసీ టీవీలను అమర్చుకోవటం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu