Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సముద్రపు మంచు ఉప్పగా ఉండదా?

Advertiesment
సముద్రము
, శనివారం, 8 అక్టోబరు 2011 (10:51 IST)
FILE
సముద్రపు నీరు ఉప్పగా ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే సముద్రపు నీటితో ఏర్పడిన మంచు (సీ ఐస్) లో ఉప్పు ఉంటుందో లేదో చాలామందికి తెలియదు. సీ ఐస్‌లో ఉప్పు ఉండదు. అందుకే ధృవ ప్రాంతాలలో ఉండేవారు మంచును కరిగించి, ఆ మంచు నీటిని మంచినీరుగా వాడుకుంటారు.

సాధారణంగా ధృవాల దగ్గర మహాసముద్రాలలో సీ ఐస్ ఏర్పడుతుంది. మంచి నీరు గడ్డ కట్టడానికి అవసరమయ్యే ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్‌లలో ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో సముద్రపు నీరు గడ్డకట్టి మంచుగా మారుతుంది. ఈ ప్రక్రియలో సముద్రపు నీరు ఉప్పును కోల్పోతుంది. కాబట్టి సముద్రపు మంచులో ఉప్పు ఉండదన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu