యేడాదికి వెయ్యి సూర్యుళ్లు ఉత్పత్తి చేసే పాలపుంత ఎక్కడుంది?
, శుక్రవారం, 15 మార్చి 2013 (16:26 IST)
సాధారణంగా వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఒక్క సూర్యుడితోనే. అలాంటిది వెయ్యి సూర్యుళ్లు ఉండే ప్రాంతంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. ఒక సూర్యుడి ప్రభావానికే భూమండలంపై ఉన్న మనం హడలి పోతుంటే... 40 లక్షల కోట్ల సూర్యుళ్ల ప్రతాపానికి ఏమై పోతామో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ప్రస్తుతం మన భూమండలం ఉన్న పాలపుంతకు ఆవల.. కోట్ల కాంతి సంవత్సరాల సుదూరంలో ఓ భయంకర పాలపుంత ఉన్నట్టు తాజాగా కనుగొన్నారు. ఈ పాలపుంత ద్వారా ప్రతి యేడాదికి వెయ్యి సూర్యుళ్లు తయారవుతున్నాయట. 'వామ్మోయ్.. ఇంతమంది సూర్యుళ్లా.. భూమికి ఏమన్నా అయితే..?' అనే సందేహమే కదా మీ ప్రశ్న. దీనిపై మీకు ఎలాంటి సందేహం వద్దని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. ఆ భయంకర పాలపుంత అవనికి 12.7 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందిట. ఈ విషయాలన్నీ ఇటీవలే ఖగోళ పరిశోధకులు చిలీలోని అటకామా ఎడారిలో "అల్మా" అనే రేడియో టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. శక్తిమంతమైనది కూడా. ఈ అల్మా రేడియో టెలిస్కోపు ఈ గుట్టుమట్లన్నీ విప్పడంతో శాస్త్రవేత్తలు వాటిని క్రోఢీకరించే పనిలో పడ్డారు.