Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొట్టమొదటి సూర్యగ్రహణం.. ఎప్పుడు.. ఎక్కడ..?

మొట్టమొదటి సూర్యగ్రహణం.. ఎప్పుడు.. ఎక్కడ..?
పిల్లలూ..! చారిత్రాత్మకమైన మొట్టమొదటి సూర్య గ్రహణం ఎప్పుడు, ఎక్కడ నమోదయ్యిందో తెలుసా...? క్రీస్తు పూర్వం 781వ సంవత్సరం, జూన్ 4వ తేదీన "మొట్టమొదటి సూర్యగ్రహణం" చైనాలో నమోదయ్యింది. ఆ సంగతలా కాసేపు పక్కనపెట్టి, అసలు ఈ సూర్యగ్రహణం కథా, కమామీషేంటో ఇప్పుడు చూద్దామా..!

భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగంలో సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజునే ఏర్పడుతుంది. భూమిని చంద్రుడి పూర్ణ ఛాయ (అంబ్రా) కప్పినపుడు మాత్రమే సంపూర్ణ సూర్య గ్రహణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి, సంపూర్ణ సూర్య గ్రహణాలు, భూమిమీద ఎక్కడైనా సరే, చాలా అరుదుగా సంభవిస్తుంటాయి.

సంపూర్ణ సూర్యగ్రహణం చూడాలనుకునేవారు ఆ గ్రహణం పట్టే ప్రదేశాలు చాలా దూరంలో ఉన్నప్పటికీ, అక్కడికి వెళ్లి చూస్తుంటారు. అలా... 1999లో ఐరోపాలో కనిపించిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ప్రపంచంలోని అత్యధిక ప్రజలు వీక్షించినట్లు రికార్డయ్యింది. ఆ తరువాత 2005, 2006వ సంవత్సరాల్లోనూ, 2007 సెప్టెంబర్ 11వ తేదీన సూర్యగ్రహణాలు ఏర్పడ్డాయి. తాజాగా జనవరి 26, 2009న కూడా సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది.

ఇదిలా ఉంటే... ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచకంగా భావించేవారు. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల ప్రజలు వీటిని అశుభ సూచకంగానే భావిస్తారు. సూర్యుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి మాయమవడంతో, చీకటి కమ్ముకోవడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురై చెడు జరుగుతుందని ఆందోళనపడుతుంటారు. అయితే విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందటంవల్ల, గ్రహణాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న ప్రజలు, వాటిపై తగినంత అవగాహన ఏర్పరచుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu