* "టెడ్డీ బేర్" అనే పేరు అమెరికా మాజీ అధ్యక్షుడు రూజ్వెల్ట్ ముద్దు పేరైన "టెడ్డీ"ని అనుకరిస్తూ పెట్టారట. మొదట్లో ఆ బొమ్మను "టెడ్డీస్ బేర్" అనేవారట.
* పిల్లలు సంవత్సరానికి సగటున ఒక్కొక్కటీ అరనిమిషం నిడివి ఉండే 20 వేల వాణిజ్య ప్రకటనలను చూస్తారని పరిశీలకుల అంచనా.
* భూమి మీదినుంచి శుక్రుడు ఎంత చిన్నగా కనిపిస్తాడో, ఫ్లూటో మీద నుంచి చూస్తే కూడా సూర్యుడు అంత చిన్నగానే.. మినుకుమినుకుమంటూ కనిపిస్తూ ఉంటాడట.
* ఒక అచ్చు అక్షరంతో ప్రారంభమై, అచ్చుతో ముగుస్తూ మధ్యలో అస్సలు అచ్చులే లేని రెండు ఆంగ్ల పదాలేవంటే... ఆస్త్మా(ASTHMA), ఇస్త్మి (ISTHMI).
* న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ భవనం ముందు భాగంలో ఉండే రెండు రాతి సింహాల పేర్లు... పేషన్స్, ఫార్టిట్యూడ్.
* నోరు బాగా ఎండిపోయి ఉన్నప్పుడు ఏమి తిన్నప్పటికీ... అసలు రుచి అనేదే తెలియదట.