Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనిషిలాగే ఉంటుంది.. సూర్యుడిని పూజిస్తుంది..!

మనిషిలాగే ఉంటుంది.. సూర్యుడిని పూజిస్తుంది..!
FILE
ఇది చూసేందుకు మనిషిలాగే ఉంటుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా సూర్యదేవుడిని పూజిస్తుంది. పెద్ద కాళ్లు, వంగిపోకుండా నిలువుగా ఉండే శరీరం, తోక పొడవుగా లేకపోవడం, రాగాలను హాయిగా వినిపించే గొంతుతో.. మనిషికి చాలా దగ్గర బంధువులాగా ఉంటుంది. ఏంటబ్బా.. అని ఆలోచిస్తున్నారు కదూ..? మనం ఇంతలా చెప్పుకున్నది "ఇంద్రీ" అనే పేరుగల ఒక కోతి గురించే..!

కేవలం మడగాస్కర్‌ అడవుల్లో మాత్రమే కనిపించే ఈ కోతి గురించి చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. అవేంటంటే..

చాలా సంవత్సరాల క్రితం ఇద్దరు అన్నదమ్ములు ఒక అడవిలో సంతోషంగా జీవిస్తుండేవాళ్లట. ఒకరోజు అన్నకి పంటలు పండించాలనే ఊహ వచ్చిందట. వెంటనే అడవిని, తమ్ముడిని వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడట. అయితే.. ఆ అడవిలో ఒంటరిగా మిగిలిపోయిన తమ్ముడు కోతిలాగా మారిపోయాడట. ఆ కోతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఇంద్రీ అట. అందుకే ఇది ఇప్పటికీ అన్న కోసం ఏడుస్తూ ఉంటుందట. ఈ ఇంద్రీ అరిచినా సరే ఏడుపులాగే వినిపిస్తుందట..!
సూర్యోదయంలో ఇంద్రీ ప్రార్థన..!
ఇంద్రీకి ఒక వింత అలవాటు ఉంది. సూర్యోదయం అవుతున్నప్పుడు ఇది సూర్యునికి ఎదురుగా కాళ్ళు ముడుచుకుని, నడుం నిటారుగా ఉంచి కూర్చుంటుంది. రెండు చేతులూ మోకాళ్ళపై ఆన్చుతుంది లేదా ఒడిలో అరచేతులు పైకి ఉండేలా ఉంచుతుంది. కళ్ళు అరమోడ్పుగా పెట్టి చాలా సేపు ఉంటుంది..
webdunia


మరో కథ ఏంటంటే.. ఒకసారి ఓ వేటగాడు అడవికి వేటకెళ్లాడట. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కొడుకు గాబరాపడి తండ్రిని వెతికేందుకు అడవికి వెళ్లాడట. అతను కూడా రాకపోయేసరికి మర్నాడు వారి ఆచూకి కోసం గ్రామస్థులంతా వెళ్లారట. అయితే వాళ్లకి ఓ పెద్ద చెట్టుమీద రెండు వింత కోతులు కనిపించాయట. వెంటనే వాళ్లు.. "తండ్రీ కొడుకులు వింత కోతులుగా మారిపోయార"ని వెనుదిరిగారట. ఆ వింత కోతులే ఇంద్రీలట..!

అదలా ఉంచితే.. ఈ ఇంద్రీల పేరు వెనుక కూడా ఓ కథ ఉంది. మడగాస్కర్ ప్రాంతంలో ఈ కోతులను చూసిన ప్రజలు "ఇంద్రీ.. ఇంద్రీ" అని అరిచారట. అంటే వాళ్ల భాషలో అర్థమేంటంటే.. "అక్కడ చూడండి" అని. ఇక అప్పటినుంచి ఆ కోతుల పేరు ఇంద్రీలుగా స్థిరపడిపోయాయి. వీటిని కొంతమంది బాబాకూట్‌ అనే పేరుతో కూడా పిలుస్తుంటారు.

అన్నట్టు పిల్లలూ...! ఇంద్రీకి ఒక వింత అలవాటు ఉంది. సూర్యోదయం అవుతున్నప్పుడు ఇది సూర్యునికి ఎదురుగా కాళ్ళు ముడుచుకుని, నడుం నిటారుగా ఉంచి కూర్చుంటుంది. రెండు చేతులూ మోకాళ్ళపై ఆన్చుతుంది లేదా ఒడిలో అరచేతులు పైకి ఉండేలా ఉంచుతుంది. కళ్ళు అరమోడ్పుగా పెట్టి చాలా సేపు ఉంటుంది. ఈ వింత అలవాటు చూసి అక్కడి ప్రజలంతా ఇది సూర్యుడిని ధ్యానం చేస్తుందని నమ్ముతారు. దాని భంగిమలు అచ్చం ఆసనాలలాగా ఉంటాయంటారు.

ఇంద్రీ గొంతు కూడా పెద్దదే. ఇది తీసే కూని రాగాలు సైతం మైలు దూరం వరకు వినిపిస్తాయి. ఒకసారి ఇది రాగం తీయడం మొదలు పెట్టిందంటే మరో మూడు నిముషాల వరకూ అసలు ఆపనే ఆపదు. ఆ సమయంలోనే ఎన్నో రకాలుగా రాగాల్ని మారుస్తుంది. ఒకోసారి దీని రాగాలు ఏడుస్తున్నట్టు కూడా ఉంటాయి. నిలబడినప్పుడు 4 అడుగుల పొడవుండే ఇంద్రీ.. 13 కిలోల బరువుంటుంది. రెండు మూడేళ్లకోసారి కేవలం ఒక్క పిల్లను మాత్రమే కంటాయి. అందుకే వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu