పిల్లల శరీరంలో పెద్దల కంటె ఎక్కువ ఎముకలు ఉంటాయి?
, మంగళవారం, 25 అక్టోబరు 2011 (17:55 IST)
పెద్దవాళ్ల శరీరంలో ఎముకల సంఖ్య 206 అని చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ పిల్లల శరీరంలో ఎముకల సంఖ్య వేరుగా ఉంటుందని తెలియకపోవచ్చు. పిల్లలు కాబట్టి పెద్ద వారిలో కంటె తక్కువ ఎముకలు ఉండొచ్చని అనుకుంటారు. కానీ పిల్లల శరీరంలో పెద్దవాళ్ల కంటె ఎక్కువ ఎముకలు ఉంటాయి.పిల్లల్లో ఉండే ఎముకల సంఖ్య 300. అయితే పిల్లల శరీరం ఎదుగుతున్న కొద్దీ కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. కాబట్టి పెద్దయ్యాక 206 ఎముకలే ఉంటాయి. అయితే స్టెర్నమ్ అనే ఎముకను మూడు ఎముకలుగా భావించి లెక్కిస్తే పెద్ద వాళ్ల శరీరంలో 208 ఎముకలు ఉంటాయి. మానవ శరీరంలో ఉండే అతి చిన్న ఎముక చెవి మధ్య భాగంలో ఉంటుంది. దీని పొడవు సుమారు 0.11 అంగుళాలు ఉంటుంది. మానవ శరీరంలో అతి పెద్దది, పొడవైనది ఫీమర్ అనే తొడ ఎముక. సగటు పురుషుని శరీరంలో ఫీమర్ ఎముక పొడవు సుమారు 48 సెంటీ మీటర్లు ఉంటుంది. ఫీమర్ ఎముక, కపాలంలో ఉండే టెంపోరెల్ అనే ఎముక శరీరంలోని ఎముకలన్నిటి కన్నా చాలా గట్టివి.