హాయ్ పిల్లలూ
మీకు గుడ్లగూబ తెలుసుకదా. అది తన సహజమైన చూపులతోనే మనల్ని భయపెడుతుంది అంటాం. కాని నిజానికి అది అలా చేయదు. పాపం కదూ. దాని చూపే అంత. ఎందుకంటే దాని కళ్ళ నిర్మాణం వలన తన కన్నులను మన లాగా గుండ్రంగా తిప్పలేందు. కాబట్టి దాని చూపే అలావుంటుంది.
దాని ఆహారం ఏమిటో తెలుసా.. బుల్లి..బుల్లి ప్రాణులు, క్రిమి కీటకాలే దానికి ఆహారం. కనీసం దానికి గూడూకూడావుండదు తెలుసా.
మరేమో అది మన కోళ్లలాగా రోజూ గుడ్లు పెట్టదు. రెండు మూడు రోజులకు ఒకసారి గుడ్డు పెడుతుంది.
ఇంకా మనలాగా కాలికి ఉన్నట్లు ఐదు వేళ్లు వుండవు. మరి.. దాని కాళ్ళకు ముందు రెండు బొటన వేళ్ళు ఉండి, వెనుక రెండు బొటన వేళ్ళు ఉంటాయి. ఇంకా దాని కాళ్ళు దృఢంగా ఉంటాయి సరేనా.