పిల్లలూ... మన గుండె పిడికిలంత పరిమాణంలోనే ఉంటుంది గానీ.. చేసే పనులు మాత్రం ఎక్కువే. మానవ శరీరంలో అతిముఖ్యమైన భాగమైన గుండె.. ఛాతీ భాగంలో ఊపిరి తిత్తుల మధ్యన ఉంటుంది. ఇది నిరంతరం రక్తాన్ని సరఫరా చేస్తుంటుంది. కాబట్టి గుండె ఎర్రటి మాంసం ముక్కలాగా ఉంటుంది.
సాధారణంగా శరీరానికి తగిన బరువుతో ఉండేవాళ్లలో గుండె ఎర్రగా ఉంటుంది. అదే బాగా లావుగా ఉన్నవారిలో మాత్రం... గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల, కాస్తంత పసుపుగా కనిపిస్తుంటుంది. ఇదలా ఉంచితే మానవ శరీరంలో రక్తనాళాల పొడవు ఎంతంటే.. దాదాపు లక్ష కిలోమీటర్లే..!!
మన శరీరంలోని రక్తం... గుండె నుంచి కాలి బొటనవేలి దాకా చేరి, తిరిగీ గుండెకు చేరుకోవడానికి పట్టే సమయం ఎంతో తెలుసా... 10 సెకెన్లు మాత్రమే. చూసేందుకు చిన్నది కనిపిస్తుందిగానీ.. రోజుకు మన గుండె లక్షసార్లు కొట్టుకుంటుంది.