మన భారతదేశంలో సెప్టెంబర్ 15కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం ఈ రోజును మనం "ఇంజనీర్స్ డే" (ఇంజనీర్ల దినోత్సవం)గా జరుపుకుంటాం. శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకను జరుపుకోవడం ఆనవాయితీ. శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య భారత ఇంజనీర్‌గా గుర్తింపబడినవారు. ఈయనను 1955లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే "భారత రత్న" బిరుదుతో సత్కరించింది.
దేశవ్యాప్తంగా ఈ రోజు ఇంజనీర్ దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈ రోజను పురస్కరించుకొని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రోజు జరుపుకునే ఇంజనీరింగ్ దినోత్సవం 150వది. ఈయన హైదరాబాదు నగరాన్ని వరదల నుంచి రక్షించేందుకు ఓ వ్యవస్థను రూపొందించారు.
శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య పూర్తి పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన భారతదేశపు ప్రముఖ ఇంజనీరు. బెంగుళూరు నగరానికి 40 మైళ్ళ దూరంలోని ముద్దెనహళ్ళి గ్రామంలో శ్రీనివాస శాస్త్రి, వెంకాయమ్మ దంపతులకు 1861 సెప్టెంబర్ 15న ఆయన జన్మించారు. ఈయన పూర్వీకులు ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారు.
భారత రత్న విశ్వేశ్వరయ్య పూనేలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఈయన కృష్ణా నదిపై నిర్మించిన "కృష్ణరాజ సాగర్" నిర్మాణ సమయంలో ఛీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆ రోజుల్లో కృష్ణరాజ సాగర్ ఆనకట్ట భారతదేశంలోనే అతిపెద్దది. ఈయన ఆధ్వర్యంలో భారతదేశంలో చాలా డ్యామ్‌లు నిర్మించారు. ఈయన పేరుతో పలు కళాశాలు అవార్డులు కూడా వెలిశాయి. శ్రీ విశ్వేశ్వరయ్య 1962 ఏప్రిల్ 12వతేదీన కాలం చేశారు.