Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తప్పు రాశారో... ఆ పెన్ను మీపై కయ్ మంటుంది... ప్రకంపిస్తుంది జాగ్రత్త!!

తప్పు రాశారో... ఆ పెన్ను మీపై కయ్ మంటుంది... ప్రకంపిస్తుంది జాగ్రత్త!!
, సోమవారం, 18 ఫిబ్రవరి 2013 (16:37 IST)
WD
అంతకంతకూ మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చేస్తున్న అద్భుతాలు అన్నీఇన్నీ కావు. ఇప్పుడు ఓ జర్మనీ సంస్థ కొత్తగా ఒక పెన్‌ను తయారు చేసింది. ఇది మామూలు పెన్ను కాదు స్మార్ట్‌పెన్. ఈ స్మార్ట్ పెన్‌తో రాస్తున్నప్పుడు మీరు తెలియకో, పరధ్యానంగానో తప్పులు రాశారనుకోండి.

ఆ తప్పులు అక్షరం లేదా గ్రామర్ తప్పులు కావచ్చు. ఏదైనా సరే తప్పు చేస్తే చాలు ఈ పెన్నుగారికి కోపం వచ్చేస్తుంది. వెంటనే కయ్ మంటూ కంపించిపోతుంది. తప్పు రాస్తున్నారంటూ చేతిని కదిలిస్తుంది. రాస్తున్నుప్పుడు పెన్ను ప్రకంపనలు సృష్టించిందంటే చాలు మనం ఏదో తప్పు రాస్తున్నట్లు అర్థం చేసుకోవాలి.

తప్పు రాస్తున్నప్పుడు వైబ్రేషన్ ఇచ్చేందుకు వీలుగా ఇందులో సెన్సర్‌లను అమర్చినట్లు ఆ సంస్థ చెప్పింది. ఈ పెన్నుతో రాస్తే చేతి రాత కూడా మెరుగుపడుతుందని, అలాగే తప్పులు కూడా రావని ఆ సంస్థ చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu