పిల్లలూ మీరెప్పుడైనా "డ్యాన్సింగ్ హౌస్" గురించి విన్నారా...? డ్యాన్సింగ్ హౌస్ అంటే డ్యాన్స్ చేస్తుందేమో అనుకుంటున్నారా..?! అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే, ఈ డ్యాన్సింగ్ హౌస్ అనే పేరు చెక్ రిపబ్లిక్‌లోని ఒకానొక ఆఫీస్ బిల్డింగ్‌కు నిక్‌నేమ్ మాత్రమే.
కల్చరల్ యాక్టివిటీకి చెక్ రిపబ్లిక్ ప్రసిద్ధి చెందినది అని నిరూపించుకునేందుకే.. ఆ నగర ప్రెసిడెంట్ ఈ రకమైన డ్యాన్సింగ్ హౌస్‌ను నిర్మించారు. చెక్‌కే చెందిన ఆర్కిటెక్చర్ వాల్డో మిల్‌నిక్ అనే అతను ఈ హౌస్ నమూనాని తయారు చేయగా.. ఈయనకు కెనడియన్ ఆర్కిటెక్చర్ ఫ్రాంక్‌ఘెరి సహాయ సహకారాలను అందించారు.
ప్రాగ్యూలో బాంబుదాడుల వల్ల ఈ కట్టడం 1945వ సంవత్సరంలో కూలిపోయింది. ఆ తరువాత పురాతనమైన ఈ భవనాన్ని తిరిగీ పునర్నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో... 1994వ సంవత్సరం నుండి పునర్నిర్మాణ పనిని ప్రారంభించి 1996 దాకా కడుతూనే ఉంది.