Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చీకట్లో వజ్రాలు మెరుస్తుంటాయెందుకు..?

Advertiesment
జనరల్ నాలెడ్జ్
FILE
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూగర్భంలో రాతి పొరల మధ్య చిక్కుకున్న బొగ్గు ముక్కలు అపారమైన వేడికి, ఒత్తిడికి గురై క్రమంగా వజ్రాలుగా మారుతాయి. నల్లగా, ముట్టుకుంటే చేతికి మసి అంటుకునే బొగ్గుముక్కలే నేడు వాడుకలో ఉండే వజ్రాలు. అయితే చీకట్లో వజ్రాలు మెరుస్తాయని అందరూ అనుకుంటారు. అది అపోహే కానీ, నిజంకాదు. ఎందుకంటే వజ్రానికి దీపంలాగా స్వయంగా వెలుగునిచ్చే శక్తి లేదు.

స్వల్ప కాంతిలో కూడా వజ్రం తళతళ మెరుస్తుంటుంది. కానీ వజ్రంలో బొగ్గు పరమాణువులు తప్ప, మరేమీ ఉండవు. భూగర్భంలోని ఒత్తిడివల్ల బొగ్గు అణువులు ఒక ప్రత్యేక పద్ధతిలో అమరి, స్పటికలాగా ఏర్పడతాయి. ఇలాంటి వాటిని గనుల్లోంచి త్రవ్వి తీసినప్పుడు మొద్దులాగా ఉంటాయేగానీ మెరవవు. వీటిని ప్రత్యేక పద్ధతిలో సానబెట్టడం వల్లనే మెరుపు సంతరించుకుంటాయి.

అలా సానబెట్టిన వజ్రం మెరుస్తూ ఉంటుంది. అలా ఎందుకు మెరుస్తుందంటే గాజు, నీరు లాంటి పారదర్శకమైన వస్తువులన్నింటికీ కాంతి కిరణాలను పంచే శక్తి ఉంది. ఈ విధంగా పంచే శక్తి అధికంగా ఉండే వస్తువు వజ్రం. కాబట్టి.. వజ్రంమీద పడిన కాంతి కిరణం బయటికి సులభంగా రాలేక మళ్లీ, మళ్లీ వెనుదిరిగి.. తిరిగి వేర్వేరు ముఖాలమీద పరావర్తనం చెందుతుంది. అలాంటప్పుడు అది వెలుగు విరజిమ్ముతున్నట్లుగా కనిపిస్తుంది.

కొన్ని వజ్రాలలో రంగురంగుల గీతలు, చారికలు, చుక్కలు కనిపిస్తుంటాయి. ఇవి స్పటికంలోని లోపాలవల్ల ఏర్పడతాయి. స్పటికం నిర్మాణంలో మామూలుగా ఉండాల్సిన బొగ్గు పరమాణువుల స్థానాలలో కొన్నిచోట్ల ఇతర ధాతువుల పరమాణువులు వచ్చి చేరటం, స్పటికంలోపల పగుళ్లు ఉండటంలాంటివి పై లోపాలలో కొన్ని రకాలుగా చెప్పవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu