Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొబ్బరికాయల్లో నీళ్లెలా వస్తాయి..?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ వేడి కొబ్బరినీళ్లు కొబ్బరికాయలు గాలి సూర్యరశ్మి ఎండోస్మెర్మ్ బీజ పోషకం ద్రవం బీజోత్పత్తి
పిల్లలూ... వేసవికాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. వేసవితాపాన్ని తగ్గించుకునేందుకు, శరీరాన్ని చల్లబరచుకునేందుకు చాలామంది కొబ్బరినీళ్లను తాగుతుంటారు. అంతవరకూ బాగానే ఉందిగానీ.. అసలు ఆ కొబ్బరికాయల్లోకి నీళ్లు ఎలా వస్తాయి అన్న సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా...? సందేహం కలిగినా, కలగకపోయినా.. అసలు ఈ కొబ్బరినీళ్ల కథా కమామీషేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చెట్లు పెరిగేందుకు గాలి, సూర్యరశ్మిలతోపాటు నీరు కూడా అవసరమే అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మూడింటి సాయంతో చెట్లు బీజ పోషకం (ఎండోస్పెర్మ్) అనే ద్రవ పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. ఫలాలు ఏర్పడడానికి కావాల్సిన కేంద్రకాలను తయారు చేయడంలో బీజ పోషకం ముఖ్య పాత్ర పోషిస్తుంది.

కొబ్బరిచెట్లలో బీజోత్పత్తి కోసం ఇలా ఏర్పడిన ద్రవమే కొబ్బరినీళ్లు. సాధారణంగా చాలా చెట్లలో ఫలాలు ఏర్పడేటప్పటికే బీజపోషక ద్రవం ఇగిరిపోతుంటుంది. కొబ్బరి చెట్లలో మాత్రం ఫలదీకరణం తరువాత ఏర్పడే 50 మిల్లీమీటర్ల పిందెలో కూడా అనేక కేంద్రకాలతో కూడిన స్వచ్ఛమైన ద్రవంగా బీజ పోషకం ఉంటుంది.

తరువాతి దశలో కొబ్బరికాయ వంద మిల్లీమీటర్ల పరిమాణానికి పెరిగేటప్పటికి చిప్ప ఏర్పడి, దాని గోడలపై బీజపోషక ద్రవం పలుచగా తెల్లటి పొరలు పొరలుగా పేరుకోవడం ప్రారంభిస్తుంది. అదే లేత కొబ్బరన్నమాట పిల్లలూ.. ఆ తరువాత కాయ పెరిగేకొద్దీ కణ విభజన జరగటం వల్ల బీజ పోషక ద్రవ పరిమాణం పెరుగుతూ, కొన్నాళ్లకు పాలలాగా చిక్కగా మారుతుంది.

ఈ దశలోని కొబ్బరికాయ నీళ్లలో ఆవుపాలలో కంటే ఎక్కువగా ప్రోటీన్లు, పోషక పదార్థాలు ఉంటాయి. చక్కెర శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. లేత కొబ్బరికాయలో కొబ్బరికంటే కొబ్బరి నీరే ఎక్కువగా ఉంటుంది. కాయ ముదిరేకొద్దీ నీరు తగ్గిపోతుంటుంది.

ఇదండీ పిల్లలూ... కొబ్బరికాయలోని నీళ్ల కథ. ఈ కొబ్బరినీళ్లలో పొటాషియం, ఆస్కార్బిక్ ఆమ్లం లాంటి పదార్థాలు కూడా కలిసి ఉంటాయి కాబట్టే... లేత కొబ్బరినీరు తాగటం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకేముంది ఇన్ని గొప్ప సుగుణాలను కలిగిఉన్న కొబ్బరిబోండాంలను ఫట్‌మని లాగించేస్తారు కదూ పిల్లలూ...!

Share this Story:

Follow Webdunia telugu