ఎయిర్ కండిషనర్ ఎలా తయారైంది?
, మంగళవారం, 25 ఫిబ్రవరి 2014 (15:00 IST)
ఎయిర్ కండిషనర్‌ను కనుగొన్న ఖ్యాతి విల్లీస్ హవిలండ్ కారియర్‌కు దక్కుతుంది. అయితే ఎయిర్ కండిషనర్ తయారీ ఒక్కరోజులో సాధ్యం కాలేదు.బాగ్దాద్‌ను పరిపాలించిన (18వ శతాబ్దంలో) అల్ మెహందీ ఎడారి ప్రాంతంలోని ఎండ వేడిమికి తట్టుకోలేక తన అంత:పురం గోడలలో అక్కడక్కడ ఖాళీలు వదిలి అందులో మంచుగడ్డలను ఉంచే ఏర్పాటు చేసుకున్నాడు. ఎయిక్ కండిషనర్ ఆలోచనకు ఇదే ఆరంభం కావచ్చు. మిక్కిలి ధనవంతుడైన ఆయన మంచుగడ్డలను తీసుకురావడానికి, వాటిని గోడలలో అమర్చడానికి ప్రత్యేకంగా పనివాళ్లను నియమించుకున్నాడు.తర్వాత ఫ్లోరిడాలో జూన్‌గోరీ అనే వైద్యుడు తన ఆస్పత్రిలో రోగుల కోసం ఒక ఎయిర్ కంప్రెసింగ్ మిషన్‌ను తయారుచేసి, మంచుగడ్డల మీదుగా దీని ద్వారా చల్లగాలి వచ్చేలా ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన ఫెర్డినాండ్ కేర్ అమోనియం కాయిల్‌ను తయారుచేశాడు. ఇది గాలిలోని వేడిని పీల్చుసేది. దీన్ని ఉపయోగించి 1902లో ఎయిర్ కండిషనర్‌ను తయారు చేశాడు. అటు తర్వాత ఆధునికమైన ఎయిర్ కండిషనర్ల తయారీ ప్రారంభమైంది.