ఎంత ఎత్తులో స్ట్రాటస్ మేఘాలు ఉంటాయి?
, గురువారం, 12 ఏప్రియల్ 2012 (17:03 IST)
6500
అడుగుల కన్నా తక్కువ ఎత్తులో ఉండే మేఘాలను స్ట్రాటస్ మేఘాలు అంటారు. ఇవి అప్పుడప్పుడు నీలాకాశంలో దూదిపింజలలాగా కనిపిస్తాయి. ఇవి తరచుగా మందంగా, ముదురు రంగులో ఉండి, నీటితో లేదా మంచుతో నిండి ఉంటాయి.వీటిలో స్ట్రాటోక్యుములస్, నింబోక్యుములస్ మేఘాలు నిర్మల వాతావరణాన్ని సూచిస్తాయి. ఇవి పెద్దగా మారి వర్షం కురిపించేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు వాటిని క్యుములోనింబస్ మేఘాలు అంటారు. వీటికే థండర్ హెడ్స్ అనే మరో పేరు కూడా ఉంది. శాస్త్రవేత్తలు మేఘాల్లో ఉండే చిన్నచిన్న తేడాలను బట్టి వాటిని ఇంకా అనేకరకాల పేర్లతో పిలుస్తారు.