Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"ఇంటెర్‌నెట్ ఉపయోగాలు" ఏంటి?

, సోమవారం, 10 నవంబరు 2008 (11:26 IST)
పిల్లలూ... కంప్యూటర్ ద్వారా తీసుకున్న ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల... అనేక లాభాలున్నాయి. మీరు ప్రపంచంలో ఏ ప్రాంతపు సమాచారాన్నయినా, ఎలాంటి విషయాలనైనా ఇంటర్‌నెట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇమెయిల్స్ ద్వారా మీ స్నేహితులతో, ఇతరులతో సంభాషించుకోవచ్చు.

మీకు ఎటువంటి వస్తువులు (ఉదా..కు కూలర్లు, ఫ్రిజ్‌లు,...) కావాలో, ఫలానా సబ్జెక్ట్ పుస్తకాల సమాచారం ఎక్కడ దొరుకుతుందో లాంటి విషయాలను నిపుణుల ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రపంచంలో ఏ దేశ వార్తా పత్రికలైనా, గ్రంథాలయాలనైనా సందర్శించవచ్చు. ఇంట్లోనే కూర్చోని ప్రపంచంలో ఏ షాపులోనైనా వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

గృహిణులకు వంటల గురించి, పిల్లలకు ఆటల గురించి, వ్యాపారస్తులకు వ్యాపార విషయాల గురించి, విద్యార్థులకు విద్యా విషయాల గురించి ఇంకా ఎవరికి ఎలాంటివి కావాలన్నా ఇంటర్‌నెట్‌లో ద్వారా తెలుసుకోవచ్చు.

ఇక లైవ్ వార్తలు, క్రికెట్, స్పోర్ట్స్ లాంటి వాటి గురించిన విస్తృతమైన సమాచారం, ఆసక్తికరమైన అంశాలను ఎన్నింటినో తెలుసుకోవచ్చు. రకరకాల గేమ్స్‌ను ఆడవచ్చు. వీడియో, ఆడియోలను, అందమైన ఫోటోలను మరెన్నింటినో చూడవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu