Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటర్నెట్ అంటే...?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ ఇంటర్నెట్ టీవీ కంప్యూటర్ టెలిఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ నెట్వర్క్ ప్రపంచం ఫీడ్ దృశ్యాలు
, గురువారం, 6 నవంబరు 2008 (13:28 IST)
పిల్లలూ..! ఇంటర్నెట్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మీరు నెట్‌వర్క్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నెట్‌వర్క్ అంటే కొన్ని కంప్యూటర్‌ల కలయిక. ఈ కంప్యూటర్‌లను అన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా ఒక దానికొకటి అనుసంధానిస్తే... దానినే ఇంటర్నెట్ అంటారు.

ఇంకా ఇంటర్నెట్ గురించి సులభంగా చెప్పుకోవాలంటే... టెలిఫోన్, టీ.వీ కంప్యూటర్... ఈ మూడింటి కలయికే అని చెప్పవచ్చు. టీవీలో దృశ్యాలను మాత్రమే చూడగలం కానీ ఇష్టం వచ్చిన సమాచారాన్ని, ప్రోగ్రాములను పొందలేము. అదే కంప్యూటర్లో అయితే కేవలం మన ఫీడ్ చేసిన ప్రోగ్రామ్‌లను మాత్రమే చూసుకోగలమేగానీ ఇతర కంప్యూటర్ల ప్రోగ్రామ్‌లు చూడలేము. ఇక టెలిఫోన్ విషయానికొస్తే... మనం మాట్లాగలమేగానీ, అవతలవారిని చూడలేము. ఈ నేపథ్యంలో పై మూడింటి అపూర్వ కలయికతో రూపొందిందే ఇంటర్‌నెట్.

ఇంటర్నెట్ అనేది ప్రపంచ వ్యాప్తంగా కలుపబడిన ప్రసార అల్లికా వ్యవస్థ. ఈ వ్యవస్థ వివిధ రకములైన కంప్యూటర్‌ల మధ్య కలుపబడిన కొన్ని లక్షల వ్యక్తులకు సేవలందిస్తుంది. ఈ ఇంటర్‌నెట్ అనేది నివిధ రకాల కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల మధ్య కూడా సమన్వయం కుదిర్చి సమాచారాన్ని అందజేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu