Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరటి పండు తింటే దోమలు కుట్టి కుట్టి పెడతాయి....

Advertiesment
బాలలు
FILE
పిల్లలూ.. మీకోసం కొన్ని సంగతులు... మిమ్మల్ని దోమలు ఎక్కువగా కుడుతున్నాయా...? అంతకుముందు మీరు అరటిపండు తిన్నారేమో చూసుకోండి. ఎందుకంటే మామూలుగా ఉన్నవారికంటే అరటిపండు తిన్నవారిని కుట్టడానికి దోమలు ఇష్టపడతాయట. ఏ ఆహారం తిన్నవారిని దోమలు వెంటనే కుడుతున్నాయనే అంశంపై అధ్యయనకారులు చేసిన పరిశోధనలో ఇది తేలింది

* అంతరిక్ష యాత్రికులకు ఏడుపొస్తే మనసారా ఏడవలేరు. అక్కడ భూమ్యాకర్షణ శక్తి ఉండదు కాబట్టి.. జలజలా కన్నీళ్లే రాలే అవకాశమే లేదు.

* మీకు డార్విన్ గురిచి తెలుసు కదా. ఆయన గద్దలు, చింపాజీల సంకరంతో ఎగిరే కోతులను సృష్టించాలని తెగ ఆరాటపడ్డారట.

* కలాల తయారీకి అవసరమైన ఈకలకోసం పక్షులను చంపడం చూసి ఓ మిచిగాన్ శాస్త్రవేత్త మనసు కరిగిపోయింది. ఆ ఆవేదనలోనుంచే బాల్ పాయింట్ పెన్ పుట్టింది.

Share this Story:

Follow Webdunia telugu