Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"అంతర్జాతీయ సర్కస్ పండుగ‌" కథా.. కమామీషు..!!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ సర్కస్ చిలుక క్రికెట్ ఏనుగు అంతర్జాతీయ పండుగ మొనాకో రాజు
పిల్లలూ...! అప్పుడప్పుడూ మన ఊర్లలో జరిగే సర్కస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. మాట్లాడే చిలుక, క్రికెట్‌ ఆడే ఏనుగు, గాల్లో ఉయ్యాలలూగుతూ ఒకరిని పట్టుకుని ఒకరు వేలాడే కళాకారులు.. వీటన్నింటినీ మనం మామూలు సర్కస్‌లలో చూస్తాం. అయితే అంతర్జాతీయ సర్కస్‌లో ప్రదర్శించేవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వీటిలో కూడా ఏనుగులు, పులులు, గుర్రాలు, చిలుకలు, పిల్లులు లాంటి జంతువులు పాల్గొంటాయి.

ఈ అంతర్జాతీయ సర్కస్ కథా కమామీషేంటంటే... దేశ విదేశాల నుంచీ అనేకమైన సర్కస్ కంపెనీల వాళ్ళంతా కలిసి... ఒకే చోట కలిసి సర్కస్ ప్రదర్శన చేస్తారు. దీన్నే "అంతర్జాతీయ సర్కస్ పండుగ" అంటారు. దీంట్లో భాగంగా... మొనాకో దేశంలో ప్రతి ఏడాది, 16 దేశాలలోని పెద్ద పెద్ద సర్కస్ కంపెనీల నుంచి దాదాపు 200 మంది కళాకారులు తరలి వచ్చి పది రోజులపాటు చాలా గొప్ప ఫీట్లు, సాహసాలు చేసి ప్రదర్శనలు ఇస్తారు.

ఈ ప్రదర్శనల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి మొనాకో రాజు... బంగారు, వెండి, కాంస్య పతకాలను ఇచ్చి సత్కరిస్తారు. సినిమాలకు సంబంధించి ఆస్కార్ అవార్డులను ఎంత గొప్పగా భావిస్తారో... అలాగే, మొనాకోలో జరిగే "ఇంటర్నేషనల్ సర్కస్ ఫెస్టివల్"లో ఇచ్చే పథకాలను కూడా అలాగే భావిస్తారు. కాగా... ఈ సర్కస్ పోటీలకు 35 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండటం విశేషం.

అసలు ఈ సర్కస్ పండుగను ఎందుకు నిర్వహిస్తున్నారంటే... మొనాకో రాజు రానియర్(3)కు చిన్నప్పటి నుంచీ సర్కస్‌లంటే భలే సరదా. ఎక్కడ సర్కస్ జరుగుతున్నా చూపించమని పేచీ పెట్టేవాడట. ఇక పెద్దయ్యాక తమ దేశానికే సర్కస్‌ను రప్పించుకోవాలన్న ఆలోచనతో, మొదటిసారిగా 1974లో పెద్ద సర్కస్ పోటీలను ఏర్పాటు చేసి, పోటీలలో పాల్గోవాలంటూ, అన్ని దేశాల సర్కస్ కంపెనీలకూ కబురు పంపించాడు.

దీంతో... అన్ని దేశాల నుంచి సర్కస్‌ కంపెనీలన్నీ తరలివచ్చి పోటీలలో పాల్గొన్నాయి. ఇక అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఈ సర్కస్ పోటీలను నిర్వహిస్తున్నారట. 2005వ సంవత్సరంలో రానియర్ రాజుగారు చనిపోయిన తరువాత కూడా.. ఆయన కుమార్తె రాణి స్టెఫానీ ఈ సర్కస్‌ పోటీలను నిర్వహిస్తోంది. ఎందుకంటే ఈ యువరాణిగారికి కూడా సర్కస్‌లంటే బోలెడు ఇష్టమట పిల్లలూ...!!

Share this Story:

Follow Webdunia telugu