Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హస్త నక్షత్రం నాలుగో పాదములో జన్మిచిన వారైతే!?

హస్త నక్షత్రం నాలుగో పాదములో జన్మిచిన వారైతే!?
, శుక్రవారం, 8 జూన్ 2012 (17:41 IST)
FILE
హస్త నక్షత్రం నాలుగో పాదములో జన్మించిన జాతకులు పుట్టిన రెండు సంవత్సరముల ఆరు నెలల వరకు చంద్ర మహర్దశ కారణంగా ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు.

2 సంవత్సరములు ఆరు నెలల వయస్సు నుంచి 4 సంవత్సరముల ఆరు నెలల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు.

9 సంవత్సరాల నుంచి ఆరు నెలల వయస్సు నుంచి 27 సంవత్సరాల ఆరు నెలల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 27 సంవత్సరములు నుంచి 43 సంవత్సరాలు ఆరు నెలల వరకు గురు మహర్దశ కావున కనకపుష్యరాగము బంగారములో చూపుడు వేలుకు ధరించగలరు.

43 సంవత్సరాలు ఆరు నెలల వయస్సు నుంచి 62 సంవత్సరముల ఆరు నెలల వరకు శని మహర్దశ కావున నీలమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 62 సంవత్సరములు ఆరు నెలల నుంచి 79 సంవత్సరముల ఆరు నెలల వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించగలరు.

79 సంవత్సరములు ఆరు నెలల వయస్సు నుంచి 86 సంవత్సరాలు ఆరు నెలల వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో చిటికెన వేలుకు ధరించగలరు.

Share this Story:

Follow Webdunia telugu