Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ రెండో పాదంలో జన్మిస్తే ఎలాంటి రాళ్ళు ధరించాలి!

Advertiesment
విశాఖ
విశాఖ రెండో పాదంలో జన్మించిన వారు 12 సంవత్సరాల వయస్సు వరకు గురు మహార్ధశలో ఉంటారు. అందువల్ల కనకపుష్య రాగమున బంగారంలో చూపుడు వేలుకు ధరించగలరు. అలాగే, 12 సంవత్సరాల వయస్సు నుంచి 31 సంవత్సరాల వయస్సు వరకు శని మహర్ధశ కావున నీలమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు.

31 సంవత్సరాల వయస్సు నుంచి 48 సంవత్సరాల మధ్య వయస్సు వరకు బుధ మహర్ధశ కావున పచ్చని బంగారంలో చిటికెన వేలుకు ధరించగలరు. 48 సంవత్సరాల వయస్సు నుంచి 55 సంవత్సరాల వయస్సు వరకు కేతు మహర్ధశ కావున వైఢ్యూర్యమును వెండిలో చిటికెన వేలుకు ధరించగలరు.

55 సంవత్సరాల వయస్సు నుంచి 75 సంవత్సరాల వరకు శుక్ర మహర్ధశ కావున వజ్రమును బంగారంలో ఉంగరపు వేలుకు ధరించగలరు. 75 సంవత్సరాల వయస్సు 82 సంవత్సరాల వరకు రవి మహర్ధశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు.

Share this Story:

Follow Webdunia telugu