విశాఖ నక్షత్రం.. నాలుగో పాదములో జన్మించిన వారైతే..?
విశాఖ నక్షత్రం.. నాలుగో పాదములో జన్మించిన వారైతే..? ఎలాంటి రత్నాన్ని ధరించాలో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి. నాలుగు సంవత్సరములు వరకు గురు మహర్దశ కావున కనకపుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించగలరు. 4
సంవత్సరముల నుండి 23 సంవత్సరముల వరకు శని మహర్దశ కావున నీలమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 23-40 సంవత్సరముల వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించగలరు. 40-
సంవత్సరాల నుంచి 47 సంవత్సరముల వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో చిటికెన వేలుకు ధరించగలరు. 47 సంవత్సరముల వయసు నుండి 67 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు. 67- 73
సంవత్సరాల వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు. 73-83 సంవత్సరమువలు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.