Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోహిణి మూడోపాదం: జన్మకారుల రత్నధారణ!

Advertiesment
ఆధ్యాత్మికం భవిష్యవాణి రత్నాల శాస్త్రం రోహిణి నక్షత్రం మహర్దశ జన్మకారుల రత్నధారణ కుజమహర్దశ సంచరిస్తుండడం వెండి చిటికెన
రోహిణి నక్షత్రం మూడోపాదంలో జన్మించిన వారికి ఐదు సంవత్సరాల పాటు చంద్రమహర్దశలో సంచరించడంతో ముత్యాన్ని వెండితో పొదిగించి వ్రేలుకు ధరించాలని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

ఐదు సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు కుజమహర్దశ ప్రభావం ఉండటంతో... పగడాన్ని బంగారంలో పొదిగంచి ఉంగరపు వ్రేలుకు ధరించుకోవాలి.

అలాగే 12 ఏళ్ల నుండి 30 సంవత్సరాల వరకు రాహుమహర్దశ సంచారం కారణంగా గోమేధికమును వెండిలో పొదిగి మధ్యవ్రేలుకు ధరించవచ్చునని శాస్త్రజ్ఞులు అంటున్నారు.

30 సంవత్సరాల నుండి 46 ఏళ్ళ వరకు గురుమహర్దశ జరగడంతో కనకపుష్యరాగమును బంగారంతో పొదిగించి చూపుడు వ్రేలుకు ధరించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

46 సంవత్సరాల నుండి 65 ఏళ్ళ వరకు శనిమహర్దశ ఉండటంతో... నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించుకున్నట్లైతే మంచి ఫలితాల్నిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

65 ఏళ్ళ నుంచి 82 సంవత్సరాల వరకు బుధమహర్దశ సంచరిస్తుండడంతో... పచ్చను బంగారంలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

82 సంవత్సరాల నుంచి 89 సంవత్సరాల వరకు కేతుమహర్దశ సంచరిస్తుండడంతో... వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu