మానవులపై నవగ్రహాల ప్రభావం ఉంటుందన్నది జ్యోతిషంలో చెప్పబడింది. ఖగోళంలో నిరంతరంగా తిరిగే నవగ్రహాలు నక్షత్ర కాంతుల్ని స్వీకరించి, వాటిని భూమిమీదికి తిరిగి ప్రసరింపజేస్తాయి. ఈ ప్రభావం మానవులపై చూపటంతో వారు వివిధ ఫలితాలను పొందుతారు. ఆరోగ్య సంబంధిత విషయాలను పరిశీలస్తే....
ముందుగా రవిగ్రహాన్నే తీసుకుంటే... జాతకంలో రవి బలహీనంగా ఉన్నా, దోష స్థానాల్లో ఉన్నట్లయితే ఎముకలు, పొట్ట, శిరస్సు, కన్నులు, గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాదు పైఅధికారులతో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రితోనేకాక బంధువులతోనూ మనస్పర్థలు తలెత్తవచ్చు.
ఇటువంటి దోషాలు తొలగిపోవుటకు కాంతి పుంజాలను కలిగిన కెంపు ఉంగరాన్ని ఈశ్వరాభిషేకం అనంతరం ధరించాలి. అంతేకాదు కెంపు రత్నాన్ని నీళ్లలో కొద్దిసేపు ఉంచి వాటిని సేవిస్తే శరీరంలో ఏర్పడిన రవిదోషం పరిహారమవుతుంది. ఎర్రని వస్తువులు, ఎరుపు రంగు పూలు, ఎరుపు రంగు దుస్తులు ధరించటం, ఆహారధాన్యాల దానం రవిగ్రహ దోష నివారకాలుగా చెప్పబడ్డాయి.