Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రత్నాల కాంబినేషన్: గ్రహ మహత్తర, అంతరదశల ఫలితాలు!

Advertiesment
రత్నాల కాంబినేషన్: గ్రహ మహత్తర
, సోమవారం, 25 ఆగస్టు 2008 (20:45 IST)
శని మహర్దశలో కేతు అంతర్దశ యందు కృష్ణవైడూర్యాన్ని మధ్యవ్రేలుకు ధరించగలరని రాత్నశాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే కేతు మహర్దశలో శని అంతర్దశ యందు కృష్ణవైడూర్యం చిటికెన వ్రేలుకు ధరించగలరని వెల్లడిస్తున్నారు.

చంద్ర మహర్దశలో కుజ అంతర్దశ యందు తెల్లపగడం ఉంగరమువ్రేలుకు వేసుకున్నట్లైతే శుభఫలితాలు చేకూరుతుందని, కుజ మహర్ధశలో చంద్ర అంతర్దశ యందు తెల్లపగడం ఉంగరం వేలుకు వెసుకున్నట్లైతే మంచి ఫలితాలనిస్తుందని వారు తెలుపుతున్నారు.

రవి మహర్దశలో శని అంతర్దశ ఉన్నప్పుడు కెంపు, నీలం ఉంగరం వేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలను ఇస్తుందని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు. గురు మహర్దశలో రవి అంతర్దశ పుష్యరాగ నీలం మధ్యవేలుకు ధరించినట్లైతే మంచి ఫలితాలను నిస్తుందని తెలుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu