Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మృగశిర మూడోపాద జన్మకారుల రత్నధారణ!

మృగశిర మూడోపాద జన్మకారుల రత్నధారణ!
, శనివారం, 20 సెప్టెంబరు 2008 (18:35 IST)
మృగశిర మూడోపాదంలో పుట్టిన వారికి మూడు సంవత్సరం ఆరు నెలల వరకు కుజమహర్దశ ప్రవేశించడంతో పగడమును బంగారు పొదిగించిన ఉంగరాన్ని ఉంగరపు వ్రేలుకు ధరించినట్లైతే మంచి ఫలితాలు దరిచేరుతాయని రత్నాల నిపుణులు చెబుతున్నారు.

మూడు సంవత్సరం ఆరునెలల నుండి 21 సంవత్సరాల ఆరునెలల వరకు రాహుమహర్దశలో సంచరించడంతో గోమేధికాన్ని వెండితో పొదిగించి మధ్య వ్రేలుకు ధరించడం శ్రేయస్కరమని వారు అంటున్నారు.

21 సంవత్సరాల ఆరునెలల నుండి 37 సంవత్సరాల ఆరు నెలల వరకు గురుమహర్దశ ప్రభావం ఉండటంతో... కనకపుష్యరాగమును బంగారంలో పొదిగంచి చూపుడు వ్రేలుకు ధరించుకోవడం మంచిది.

37 ఏళ్ళ ఆరునెలల నండి 56 సంవత్సరాల ఆరునెలల వరకు శనిమహర్దశ సంచారం కారణంగా నీలమును వెండిలో పొదిగి మధ్యవ్రేలుకు ధరించవచ్చునని రత్నాల శాస్త్రం పేర్కొంటుంది.

56 సంవత్సరాల ఆరునెలల నుండి 73 ఏళ్ళ ఆరు నెలల వరకు బుధమహర్దశ జరగడంతో పచ్చను బంగారంతో పొదిగించి చిటికెన వ్రేలుకు ధరించుకోవడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి.

73 సంవత్సరాల ఆరు నెలల నుండి 80 ఏళ్ళ ఆరు నెలల వరకు కేతుమహర్దశ ఉండటంతో... వైఢూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే మంచి ఫలితాల్నిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

80 ఏళ్ళ ఆరునెలల నుంచి 100 సంవత్సరాల ఆరు నెలల వరకు శుక్రమహర్దశ సంచరిస్తుండడంతో... వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభపరిణామాలు జరుగుతాయని వారు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu