Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ పుట్టిన తేదీని బట్టి మీ అదృష్ట రత్నమేమిటో తెలుసా!?

Advertiesment
మీ పుట్టిన తేదీని బట్టి మీ అదృష్ట రత్నమేమిటో తెలుసా!?
, సోమవారం, 30 జనవరి 2012 (15:45 IST)
FILE
మీరు పుట్టిన తేదీని బట్టి మీ అదృష్ట రత్నమేమిటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. జాతకం ప్రకారం జన్మదిన తేదీని బట్టి రత్నాన్ని ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

ఈ క్రమంలో 21 మార్చి-19 ఏప్రిల్ తేదీ వరకు పుట్టిన జాతకులు మాణిక్యం, ఎరుపు (Blood stone) ధరించడం శుభఫలితాలను ఇవ్వగలదు. అలాగే 20 ఏప్రిల్- మే 20వరకు గల తేదీల్లో పుట్టిన జన్మకారులు పచ్చను ధరించడం మంచిది.

21 మే నుంచి 21 జూన్ వరకు- నీలం, వజ్రము, 22 జూన్ నుంచి -22 జూలై వరకు ముత్యం, వజ్రం, క్రిస్టల్, వైఢూర్యం వంటి రత్నాలను ధరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడం, వ్యాపారాభివృద్ధి వంటి శుభసూచనలుంటాయి.

23 జూలై నుంచి 22 ఆగస్టు వరకు-మాణిక్యం, పుష్యరాగం,
23 ఆగస్టు నుంచి 22 సెప్టెంబర్ వరకు- పచ్చ, వజ్రం ముత్యం,
23 సెప్టెంబర్ నుంచి 23 అక్టోబర్ వరకు- ముత్యం,
24 అక్టోబర్ 20 నవంబర్ వరకు- మాణిజ్యం,
21 నవంబర్ -21 డిసెంబర్ వరకు- ఎమిథిస్ట్ (Amethyst),
22 డిసెంబర్ 19 జనవరి వరకు- ముత్యం, (Amethyst)
20 జనవరి- 19 ఫిబ్రవరి వరకు- నీలం, పుష్యరాగం,
20 ఫిబ్రవరి నుంచి 20 మార్చి వరకు - అగేట్ (Agate), నీలం, మరకతం, ఎమిథిస్ట్ (Amethyst) ధరించడం ద్వారా మంచి ఫలితాలుంటాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu