పుబ్బ నక్షత్రం, నాలుగో పాదములో జన్మించిన జాతకులైతే!
పుబ్బ నక్షత్రం నాలుగో పాదములో జన్మించిన జాతకులైతే పుట్టిన ఐదు సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు. ఐదు సంవత్సరముల నుంచి 11 సంవత్సరముల వరకు శని మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు. 11 సంవత్సరముల నుంచి 21 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు. 21
సంవత్సరముల వయస్సు నుంచి 28 సంవత్సరముల వయస్సు వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు. 28 సంవత్సరముల నుంచి 46 సం.ల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 46
సం.ల నుండి 62 సం.ల వరకు గురు మహర్దశ కావున కనకపుష్యరాగమును బంగారములో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించడం శ్రేయస్కరం. 62 సంవత్సరముల వయస్సు నుండి 81 సంవత్సరముల వరకు శని మహర్దశ కావున నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం ఉత్తమమని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.