Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పంచలోహపు శివలింగ ఉంగరం ధరిస్తే..!

Advertiesment
శివలింగం
, మంగళవారం, 18 జనవరి 2011 (18:26 IST)
FILE
పంచలోహపు శివలింగ ఉంగరాన్ని ధరిస్తే పాపాలు హరించివేయబడుతాయి. పంచలోహముతో కూడిన శివలింగాన్ని కుడిచేయి ఏ వ్రేలికైనా ధరించడం ద్వారా కుటుంబసౌఖ్యం, జ్ఞానం, ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

ఆడ, మగ ఎవరైనా ప్రతిదినం స్నానానంతరం మీ వేలికున్న ఉంగరాన్ని పూజగదిలో తీసి ఉద్దరిణితో ఆ ఉంగరానికి పైన ఉన్న శివలింగానికి అభిషేకం చేసి ధరించినట్లైతే శివపార్వతులు, వినాయకస్కంధులు తృప్తి చెంది కుటుంబసౌఖ్యాన్ని ప్రసాదిస్తారు.

అలాగే ఈ పంచలోహ విగ్రహాన్ని నీటితో అభిషేకం చేస్తే కుటుంబసౌఖ్యం, చక్కరతో కలిపిన పాలతో అభిషేకిస్తే జ్ఞానం పెంపొందుతుంది. అలాగే గంగాజలంతో అభిషేకం చేస్తే పాపాలు తొలగిపోతాయి.

ఇంకా నూనెతో వ్యాపారాభివృద్ధి, మంచినూనెతో చేస్తే శతృవినాశనం జరుగుతుంది. తేనెతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం, చెరకు రసంతో అభిషేకం చేస్తే సుఖమైన జీవితం చేకూరుతుందని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu