Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవరత్నాలను పరీక్షించడం ఎలా?

Advertiesment
ఆధ్యాత్మికం భవిష్యవాణి రత్నాల శాస్త్రం జన్మరాశి
, సోమవారం, 22 సెప్టెంబరు 2008 (14:25 IST)
జాతకుల జన్మరాశి, లగ్న, నక్షత్రములను బట్టి నవరత్నధారణ చేయడం శ్రేయస్కరమని నిపుణులు పేర్కొంటున్నారు. రత్నధారణకు ముందు రత్నాలను పరీక్షించి, ఆ తర్వాత వాటిని రత్నాల శాస్త్రజ్ఞుల సూచనల మేరకు బంగారంలోనో లేదా వెండిలోనూ పొదిగించుకుని ధరించడం మంచిది. ఇందులో భాగంగా రత్నాలను ఎలా పరీక్షించాలనే అంశాలను పరిశీలిస్తే...

కెంపు... కెంపుని ఒక గాజు పాత్రలో ఉంచగానే దాని కిరణములు ఎండలో కనిపించాలి. అలా కనిపిస్తే ఆ రత్నం మేలిమి అని గ్రహించాలి. అదే విధంగా అరచేతిలో కెంపును తీసుకోగానే కొద్దిగా ఉష్ణముగానూ, బరువుగానో కనిపిస్తుంది. ఆవుపాలలో కెంపును ఉంచినట్లైతే పాలు గులాబీ రంగుగా మారితే అది కెంపు రత్నమని సులభంగా తెలుసుకోవచ్చునని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ముత్యం... ఒక మట్టిపాత్రలో గోమూత్రాన్ని తీసుకుని ఒక రాత్రి అంతా ఉంచాలి. అలా ఉంచినప్పుడు ముత్యం పగలకుండా ఉంటేనే అది మేలిమి రకానికి చెందిందని నిపుణులు పేర్కొంటున్నారు. అదే విధంగా ఒక గాజు పాత్ర నిండా నీటిని తీసుకుని ముత్యమును ఉంచగానే తెల్లటి కిరణములు వెలువడితే అది ముత్యమని గ్రహించాలి.

పగడము... ఆవుపాలలో పగడము ఉంచినట్లైతే ఎర్రటి రంగు కనబడుతుంది. రక్తములో పగడమును ఉంచినట్లైతే దాని చుట్టు రక్తం పేరుకుంటుంది.

పచ్చ... ఒక గాజు పాత్ర నిండా నీటిని తీసుకుని పచ్చని ఉంచగానే వీటి నుంచి పచ్చ కిరణములు వెలువడితే అది పచ్చరత్నమని గ్రహించాలని రత్నశాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

పుష్యరాగం... ఒక పాత్రలో పచ్చిపాలు తీసుకుని 24 గంటలు దానిలోఉంచినట్లైతే దాని కాంతి మారకూడదు. అలా అయితే అది పుష్యరాగ రత్నమని భావించాలి.

వజ్రం... చీకటిలో వజ్రం చూడగా మిణుగురు పురుగులా మెరుస్తుంది. ఎండలో వజ్రాన్ని చూసే దానిలో ఇంద్ర ధనుస్సు కిరణాలు కనబడితే అది వజ్రమని గ్రహించాలి.

నీలం... ఆవుపాలలో నీలరత్నమును వేసినట్లైతే పాలు నీలముగా మారుతుంది. అలా కాకుండా ఎండలో నీలమును చూసినట్లైతే నీలపు కిరణాలు వెలువడితే దాన్ని నీలరత్నమని తెలుసుకోవాలి. ఒక గాజు పాత్ర నిండా నీటిని తీసుకుని నీలమును అందులో ఉంచినట్లైతే నీటి నుంచి నీలపు కిరణాలు వెలువడుతాయి.

గోమేధికం... ఈ రత్నాన్ని 24 గంటల పాటు గోమూత్రంలో వుంచినట్లైతే దాని రంగు మారిపోతుందని రత్నశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.

వైఢూర్యము... వైడూర్యమును ఎముక మీద ఉంచితే 24 గంటల్లో అవి ముక్కలుగా అవుతుందని రత్నాల శాస్త్రం వెల్లడిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu